బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్7( Bigg Boss Show Season 7 ) ముగియడం ఆ షో అభిమానులను ఎంతగానో బాధ పెడుతోంది.బిగ్ బాస్ షో ఓటీటీ త్వరలో మొదలుకానుందని ప్రచారం జరుగుతున్నా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.
అయితే బిగ్ బాస్ శివాజీ శోభాశెట్టి గురించి తాజాగా కామెంట్లు చేయగా ఆ కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.శివాజీ తాజాగా శోభాశెట్టికి వార్నింగ్ ఇవ్వడం గమనార్హం.
శివాజీ భాషా బేధం చూపిస్తాడని శోభాశెట్టి కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.అయితే శివాజీ చేసిన కామెంట్ల గురించి శోభాశెట్టి రియాక్ట్ అవుతూ మేము నిజంగా భాషా బేధాలను చూపిస్తూ ఉంటే తెలుగులో ఎందుకు ఆదరిస్తామని ఇవన్నీ పిచ్చిపిచ్చి మాటలని ఆమె మెచ్యూరిటీ లేకుండా మాట్లాడుతోందని శివాజీ ( Shivaji )అభిప్రాయపడ్డారు.
శోభాశెట్టిని ( Shobha Shetty )తెలుగు ప్రేక్షకులు ప్రోత్సహించారంటే ఆమె నటన బాగుండటమే కారణమని శివాజీ అన్నారు.
ప్రతిభ ఉంటే ఎవరినైనా ఆదరించడం జరుగుతుందని తాను కన్నడ అమ్మాయినని శోభాశెట్టి చెప్పుకోవాల్సిన అవసరం ఏముందని నా విషయంలో శోభాశెట్టి చాలా ఓవర్ యాక్షన్ చేసిందని శివాజీ వెల్లడించారు.మొదట్లో శోభాశెట్టి బాగానే ఉందని ఆ తర్వాత నిజస్వరూపం చూపించడం మొదలుపెట్టిందని శివాజీ కామెంట్లు చేశారు.నేను ఒక ఆర్టిస్ట్ నని అలా మాట్లాడవద్దు ఇలా మాట్లాడవద్దని అనడం ఎవరికీ మంచిది కాదని శివాజీ వెల్లడించారు.
శోభాశెట్టి విషయంలో శివాజీ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి. శివాజీ తన స్నేహితులు ప్రశాంత్, యావర్ లతో కలిసి సినిమా చేస్తానని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్7 ఓటీటీ( Bigg Boss 7 OTT ) ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. బిగ్ బాస్ శివాజీ( Big Boss Shivaji ) చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి.