నాగార్జున( Nagarjuna ) హీరోగా రూపొందిన నా సామి రంగ సినిమా( Naa Saami Ranga ) ను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.అయితే సినిమా షూటింగ్ కాస్త ఆలస్యంగా మొదలు పెట్టడంతో షూటింగ్ పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సంక్రాంతికి అంటూ మొన్నటి వరకు కూడా హడావుడి చేశారు.మొన్నటికి మొన్న బిగ్ బాస్ లో కూడా సంక్రాంతికి సినిమా ను తీసుకు వస్తాను అంటూ నాగార్జున ఫ్యాన్స్ కి హామీ ఇచ్చాడు.
ఒక వైపు సంక్రాంతి సినిమా ల జోరు కంటిన్యూ అవుతోంది.పాటలు విడుదల చేస్తూ రచ్చ చేస్తున్నారు.
ప్రమోషన్స్ చేస్తూ కుమ్మేస్తున్నారు.
ఈవెంట్స్ చేస్తూ హంగామా సృష్టిస్తున్నారు.కానీ నాగార్జున మాత్రం ఇంకా షూటింగ్ దశలోనే ఉన్నాడు.గుంటూరు కారం సినిమా షూటింగ్ కూడా పూర్తి అయింది.
కానీ ఇప్పటి వరకు అసలు నా సామి రంగ సినిమా యొక్క షూటింగ్ అప్‌డేట్ ను దర్శకుడు విజయ్ బిన్నీ చెప్పడం లేదు.సంక్రాంతికి విడుదల ఉండదేమో అనుకుంటున్నారు కొందరు.
రిపబ్లిక్ డే సందర్భంగా నా సామి రంగ సినిమా ను విడుదల చేసే ఉద్దేశ్యంతో వాయిదా వేస్తారా అంటున్నారు.
ఎలాగూ సంక్రాంతికి ఫుల్ కాంపిటీషన్ ఉంది.అంతే కాకుండా సినిమా షూటింగ్ కూడా ఇంకా పూర్తి అవ్వలేదు.హడావుడిగా చేసి ఎందుకు సినిమా ను వదలాలి అనుకున్నారో ఏమో కానీ ఇప్పటి వరకు సంక్రాంతికి రిలీజ్ అంటూ అధికారికంగా డేట్ ను అనౌన్స్ చేయలేదు.
ఇప్పటి వరకు సినిమా షూటింగ్ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సినిమా ప్రమోషన్ ను చేసే అవకాశం మరియు సమయం లేదు.అందుకే సంక్రాంతి వరకు నాగార్జున సినిమా పూర్తి అవ్వక పోవచ్చు, రిపబ్లిక్ డే వరకు వెయిట్ చేయాల్సి రావచ్చు అనే టాక్ వినిపిస్తోంది.
ఆ విషయమై క్లారిటీ రావాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందేనేమో.