బిగ్ బాస్ షో ఫేక్ షో.. జనాలను పిచ్చోళ్లను చేస్తున్నారు.. సరయు షాకింగ్ కామెంట్స్ వైరల్!

బిగ్ బాస్ షో( Bigg Boss Show ) విషయంలో ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.ఈ షోకు హాజరైన సెలబ్రిటీలు సైతం ఈ షో గురించి వేర్వేరు కామెంట్లు చేశారు.

 Bigg Boss Sarayu Comments Goes Viral In Social Media Details Here Goes Viral,b-TeluguStop.com

తాజాగా బిగ్ బాస్ షో కంటెస్టెంట్ సరయు( Sarayu ) ఈ షో ఫేక్ షో అంటూ ఒక ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.సరయు మాట్లాడుతూ ఈ రియాలిటీ షోలు అన్నీ ఫేక్ అని కామెంట్లు చేశారు.

కొనుక్కోవడం లేదా తిరిగి వాళ్లకు డబ్బులు ఇవ్వడం ద్వారా మనకు సంబంధించిన వాళ్లను ముందుకు తీసుకెళ్లే ఫ్లాట్ ఫామ్స్ రియాలిటీ షోలు అని సరయు చెప్పుకొచ్చారు.ఈ రియాలిటీ షోల ద్వారా మిమ్మల్ని, మమ్మల్ని జనాలను పిచ్చోళ్లను చేస్తున్నరని ఆమె కామెంట్లు చేశారు.దయచేసి ఇలాంటి రియాలిటీ షోలు( Reality Shows ) చూడవద్దని మీ సమయం వృథా చేసుకోవద్దని సరయు అభిప్రాయం వ్యక్తం చేశారు.
నేను బిగ్ బాస్ షోలో పాల్గొన్న కంటెస్టెంట్ ను కాబట్టే ఈ విషయాలు చెబుతున్నానని సరయు అన్నారు.

బిగ్ బాస్ షోకు వెళ్లిన సమయంలో నాకేం తెలియదని ఆమె అన్నారు.జాబ్ చేశామా? ఇంటికొచ్చామా? యూట్యూబ్ వీడియోలు చేస్తున్నామా? ఇది మాత్రమే నా ఆలోచన అని సరయు అన్నారు.బిగ్ బాస్ షోలో ఉన్న కంటెస్టెంట్లకు బయటినుంచి సపోర్ట్ లభించడంతో పాటు లోపలినుంచి కూడా లభించేదని ఆమె అన్నారు.

బిగ్ బాస్ హౌస్( Bigg Boss House ) లో ఉన్న అలాంటి కంటెస్టెంట్ల కాన్ఫిడెన్స్ వేరే లెవెల్ లో ఉండేదని సరయు చెప్పుకొచ్చారు.అలాంటి వాళ్లతో పోరాడటం సులువు కాదని వాళ్లతో పోరాడితే నెగిటివ్ అయ్యేది మనమేనని సరయు వెల్లడించారు.ఆ సమయంలో తాను ఒత్తిడికి గురయ్యేదానినని సరయు చెప్పుకొచ్చారు.

సరయు చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube