బిగ్ బాస్ షో( Bigg Boss ) ద్వారా పాపులర్ అయిన ప్రియాంక సింగ్( Priyanka singh ) ఈ మధ్య కాలంలో టీవీ షోలలో ఎక్కువగా కనిపించడం లేదనే సంగతి తెలిసిందే.ప్రియాంక సింగ్ అలియాస్ పింకీని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య తక్కువేం కాదు.
లెహంగాలో పెళ్లి కూతురి గెటప్ లో ప్రియాంక సింగ్ కనిపించడంతో ఈ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.అయితే ఆ తర్వాత ప్రియాంక సింగ్ పెళ్లికి సంబంధించి ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు.
తాజాగా ప్రియాంక సింగ్ స్పందిస్తూ తన పెళ్లి వార్తల గురించి పూర్తిస్థాయిలో క్లారిటీ ఇచ్చారు.నా పెళ్లి జ్యూవెలరీ షాపింగ్ అంటూ షేర్ చేసిన వీడియో వల్ల ప్రియాంక సింగ్ పెళ్లికి సంబంధించి వేర్వేరు వార్తలు వినిపించాయి.
ప్రియాంక సింగ్ స్పందిస్తూ నాకు కాబోయే భర్త ఎవరని అడుగుతున్నారని నిజంగానే త్వరలో పెళ్లి చేసుకోబోతున్నానని సింపుల్ గా ఈ పెళ్లి జరగబోతుందని అన్నారు.ఈ వివాహం కోసం నగలు తీసుకుందామని అనుకుంటున్నానని ప్రియాంక సింగ్ పేర్కొన్నారు.
చివర్లో అబ్బాయి గురించి పూర్తి వివరాలు చెబుతానని ప్రియాంక సింగ్ చెప్పుకొచ్చారు.మాది లవ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజా? అనే విషయం చివర్లో చెబుతానని ప్రియాంక సింగ్ అన్నారు.నగల షాపింగ్ పూర్తైన తర్వాత పెళ్లి నాది కాదని నా ఫ్రెండ్ దని చెబుతూ ప్రియాంక సింగ్ చెప్పుకొచ్చారు.నేను పెళ్లి చేసుకుంటానని జరిగే ప్రచారంలో నిజం లేదని ప్రియాంక సింగ్ కామెంట్లు చేశారు.
నేను జస్ట్ ఇది ప్రాంక్ వీడియోగా ( Prank video )చేశానని ఆమె చెప్పుకొచ్చారు.ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని ప్రియాంక సింగ్ కామెంట్లు చేశారు.ప్రియాంక సింగ్ కెరీర్ పరంగా బిజీ కావడంతో పాటు మరిన్ని సక్సెస్ లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.