బిగ్ బాస్ కార్యక్రమం ప్రస్తుతం సీజన్ 6 ప్రసారమవుతూ ఇప్పటికి రెండు వారాలను పూర్తి చేసుకుంది.ఇక రెండవ వారం పూర్తి కావడంతో ఈ కార్యక్రమం నుంచి ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు.
శనివారం బిగ్ బాస్ హౌస్ నుంచి కంటెస్టెంట్ షాని ఎలిమినేట్ కాగా ఆదివారం అభినయశ్రీ బయటకు వచ్చారు.ఇక బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు బజ్ కార్యక్రమానికి హాజరవుతారని విషయం మనకు తెలిసిందే.
ఇక ఈ సీజన్లో బజ్ కార్యక్రమానికి యాంకర్ శివ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నారు.
ఈ క్రమంలోనే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన షానీ బజ్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రోమో విడుదల చేశారు.
ఇందులో భాగంగా యాంకర్ శివ తనని ప్రశ్నిస్తూ స్ట్రైట్ గా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను బిగ్ బాస్ నుంచి ఒక కంటెస్టెంట్ బయటకు రావాలంటే జనాలు వేస్ట్ అనుకోవాలి కానీ హౌస్ లో 2 వీక్స్ మీతో పాటు ఉన్న కంటెస్టెంట్లు కూడా మిమ్మల్ని వేస్ట్ అంటూ బయటకు పంపించారు అంటూ ప్రశ్నించగా ఈ ప్రశ్నకు షానీ సమాధానం చెబుతూ హౌస్ లో ఉన్నటువంటి 20 మంది కంటెస్టెంట్స్ వేస్ట్ అన్న నా లైఫ్ వేస్ట్ కాదు అంటూ ఈయన సమాధానం చెప్పారు.

ఇకపోతే హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ ల గురించి ఈయన ఒక్కొక్కరి గురించి ఒక అభిప్రాయాన్ని వెల్లడించారు.ఇలా బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువ వారాలపాటు కొనసాగుతారని భావించినటువంటి ఈయన ఊహించని విధంగా బయటకు రావడంతో బజ్ కార్యక్రమంలో ఎన్నో విషయాలను పంచుకున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ ప్రసారమైన అనంతరం ఈయన ఏ కంటెస్టెంట్ గురించి ఎలాంటి కామెంట్స్ చేశారు అనేది తెలియనుంది.
ఇక రెండవ వారానికి ఇద్దరు కంటెస్టెంట్లు బయటకు రావడంతో మొత్తం 19 మంది కంటెస్టెంట్లు హౌస్ లో పోటీ పడుతున్నారు.