కరోనా జాగ్రత్తలతో బిగ్ బాస్-4 ప్రారంభం..!

బిగ్ బాస్.అన్ని భాషాలలో ప్రసారమయ్యే ఈ రియల్టీ షోకు చాలా మందే అభిమానులున్నారు.తెలుగులో మూడు సీజన్లతో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.అయితే, కరోనా కారణంగా బిగ్ బాస్-4 ఉంటుందా ఉండదా అని బిగ్ బాస్ అభిమానులు అనుమానాలు వ్యక్తం చేసారు.

 Big Boss With Strict Corona Actions, Corona Effect, Bigg Boss 4, Nagarjuna, Spec-TeluguStop.com

అయితే, వారి సందేహాలన్ని పటాపంచలు చేస్తూ.స్టార్ మా బిగ్ బాస్ నాలుగో సీజన్ ప్రోమోను రిలీజ్ చేసింది.

దీంతో బుల్లితెర ప్రేక్షకుల్లో సందడి మొదలైంది.ఇక కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో షోను కట్టుదిట్టమైన కరోనా జాగ్రత్తలో నిర్వహించాలని ఇప్పటికే నిర్వహకులు ప్లాన్ చేస్తున్నారట.

బిగ్ బాస్ హౌస్ సెట్ నిర్మాణం దగ్గరనుండి బిగ్ బాస్‌‌కి కావలసిన టెక్నీషియన్స్ వరకు అన్ని సిద్ధం చేసిన స్టార్ మా ఇప్పుడు కంటెస్టెంట్స్‌కి కరోనా టెస్ట్ చేసి 14 రోజులు వాళ్ళ ఆధ్వర్యంలో క్వారంటైన్‌లో పెట్టి మరి పాజిటివ్ రానివారిని బిగ్ బాస్ హౌస్‌లోకి పంపే ఏర్పాట్లని బిగ్ బాస్ యాజమాన్యం చేస్తుందనే టాక్ టాలీవుడ్‌లో చక్కర్లు కోడుతుంది.

అలాగే, బిగ్ బాస్ కంటెస్టెంట్స్, టెక్నీషియన్లు, వ్యాఖ్యాతల కోసం భారీగా ఇన్సూరెన్స్ చేయించారని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

ఇక నాలుగవ సీజన్‌కు కూడా సినీ యాక్ట‌ర్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్నాడు.ఆయన ఇందుకోసం నిర్వాహకులకు పలు కండిషన్స్ పెట్టినట్టు సమాచారం.ఒక మేకప్ మ్యాన్ మినహా హౌస్ మేట్స్‌తో సహా, ఇతర టెక్నీషియన్లు ఎవరూ ఆయనను నేరుగా కలవకూడదని చెప్పారట.నాగార్జున కోసం బిగ్‌బాస్ నిర్వాహకులు ప్రత్యేకంగా ఓ గదిని ఏర్పాటు చేసినట్టు చెబుతున్నారు.

ఇంటి నుంచి సరాసరి ఆ స్పెషల్ రూమ్‌కు వచ్చి షూటింగ్ చేసి వెళతారట.అంతేకాదు వారంలో ఒకరోజు మాత్రమే నాగార్జున షోలో పార్టిసిపేట్ చేస్తారట.

మిగతా రోజుల్లో కూడా కొంత మంది సెలబ్రిటీలు ఈ షోలో పాల్గొనబోతున్నట్టు సమాచారం

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube