అమెరికా తమ దళాలను ఆఫ్ఘాన్ నుంచీ తరలించడంతోనే తాలిబన్లు ఆఫ్ఘాన్ పై దాడులు మొదలు పెట్టారు.ఆఫ్ఘాన్ ను పూర్తిగా వశం చేసుకున్న తరువాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనీ భావిస్తున్న తరుణంలో తమ దేశం నుంచీ విదేశీయులు వెళ్ళిపోవడానికి గడువును విధించారు.
అయితే ఎంతో మందిని అమెరికా ప్రభుత్వం, భారత ప్రభుత్వం తమ విమానాల ద్వారా తరలిస్తున్న నేపధ్యంలో బిడెన్ ఓ సంచలన ప్రకటన చేశారు.కాబూల్ ఎయిర్ పోర్ట్ లో దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
అయితే బిడెన్ ఈ ప్రకటన చేసిన కొన్ని గంటలలోనే ఆత్మాహుతి దాడి జరగడంతో ఒక్క సారిగా కాబూల్ ఎయిర్పోర్ట్ రక్త సిక్తం అయ్యింది.దాదాపు 70 మంది చనిపోగా, 150 మంది పైగా గాయాల పాలయ్యారు.
కొందరి పరిస్థితి తీవ్ర విషమంగా ఉంది.అంతేకాదు మరీ ముఖ్యంగా ఈ దాడిలో దాదాపు అమెరికా రక్షణ సిబ్బంది 13 మంది కూడా మృతి చెందినట్టుగా తెలుస్తోంది.
ఈ ఘటనపై అగ్ర రాజ్య అధ్యక్షుడి బిడెన్ తీవ్రంగా స్పందించారు.వైట్ హౌస్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన బిడెన్ మాట్లాడుతూ ఈ ఘటనకు కారణం అయిన ఎవరిని ఊరికే వదిలిపెట్టేది లేదని ఈ దాడిని అంత తేలికగా మరిచిపోమని ప్రకటించారు.

ప్రతీ ఒక్కరిని వెంటాడి వెంటాడి ప్రతీకారం తీర్చుకుంటామని, దాడి చేసిన వాళ్ళు అమెరికా ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ కోసం సిద్దంగా ఉండాలని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.ఈ రోజు జరిగిన ఈ నష్టానికి పూర్తి భాద్యత తనదేనని బిడెన్ తెలిపారు.సైన్యం తరలింపులో ఆలస్యం అయ్యిందని, అందకు తాము తీసుకున్న నిర్ణయాలు అన్నారు బిడెన్.ఇదిలాఉంటే ఆగస్ట్ 14 నుంచీ ఇప్పటివరకూ ఆఫ్ఘాన్ నుంచీ దాదాపు లక్ష మందిని పైగా తరలించామని గడిచిన 12 గంటల్లో సుమారు 7500 మందిని కాబూల్ నుంచీ తరలించామని అమెరికా విదేశాంగ శాఖా ముఖ్య కార్యదర్శి ఆంటోని బ్లింకెన్ ప్రకటించారు.