బిడెన్ ఆదేశాలు బేఖాతర్....అమెరికాలో ఓ హోటల్ తీరుపై మండిపడుతున్న నెటిజన్లు...

ఒక పక్క కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబళిస్తున్న తరుణంలో, యావత్ అమెరికా ప్రజలు ఈ మహమ్మారి ధాటికి భయాందోళనలకు లోనవుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు బిడెన్ అమెరికన్స్ కు ఎంతో ధైర్యం చెప్తూ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు.పరిస్థితులు అదుపులోకి వచ్చేంత వరకూ అమెరికా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

 Biden Orders Bekhatar Netizens On Fire Over A Hotel In America , America, Biden,-TeluguStop.com

ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరిస్తూ, సామాజిక దూరం పాటించాలని కోరారు.బిడెన్ తీసుకుంటున్న చొరవ, అమెరికా ప్రజలను కరోనా నుంచీ కాపాడాలనే తపన అమెరికన్స్ లో బిడెన్ పై అభిమానాన్ని పెంచేశాయి.

అయితే అమెరికాలో టెక్సాస్ లో ఉన్న ఓ రెస్టారెంట్ కు ఇద్దరు భార్యా భర్తలు వారి పిల్లాడిని తీసుకుని వెళ్ళారు.హోటల్ గేటు బయట ఉన్న సిబ్బంది ఒకరు వారిని ఆపి మాస్క్ లు తీయాలని కోరడంతో సెక్యూరిటీ కారణాల రీత్యా అనుకుని వారు మాస్క్ తీసి ముఖాలు చూపించి లోపలకు వెళ్ళారు.

లోపలికి వెళ్ళిన దంపతులు మాస్క్ పెట్టుకుని ఆర్డర్ కోసం వేచి చూస్తున్న సమయంలో వారి వద్దకు వచ్చిన సిబ్బంది దురుసుగా మాట్లాడుతూ మాస్క్ తీసేయాలని, తమ రూల్స్ ప్రకారం మాస్క్ ఉంటే హోటల్ లోకి అనుమతి లేదని వాదించారు.దాంతో చేసేది లేక ఇద్దరు దంపతులు బయటకు వచ్చేశారు.

తమకు జరిగిన ఈ అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.తమ బాబుకు వ్యాక్సిన్ అవ్వలేదని అందుకే తాము మాస్క్ ధరించామని చెప్పినా వారు వినిపించుకోలేదని, కరోనాను దూరం చేయడానికి మాస్క్ వాడాలని కోరారు.

అధ్యక్షుడు ఆదేశాలు పాటించక పోవడం వలెనే ప్రస్తుతం అమెరికాలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోందని, మాస్క్ నిభందన పాటించని ఇలాంటి హోటల్స్, వ్యక్తులకు ఫైన్ లు విధించాలని నెటిజన్లు మండిపడుతున్నారు.వ్యాక్సినేషన్ ప్రక్రియ ఒక వైపు వేగవంతంగా జరుగుతున్నా ఇలాంటి వారివలనే కరోనా కేసుల తీవ్రత అధికమవుతోందని మండిపడుతున్నారు నెటిజన్లు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube