ఫస్ట్ టైం మనోజ్ తో కలిసి దిగిన ఫోటోని షేర్ చేసిన మౌనిక.. ఫోటో వైరల్!

మంచు మనోజ్ గత నెల మూడవ తేదీ భూమా మౌనిక(Bhuma Mounika)ను కొద్దిమంది బంధుమిత్రులు కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే.మౌనిక తో దాదాపు 12 సంవత్సరాల పరిచయం ఉందని, తనతో నాలుగు సంవత్సరాలుగా రిలేషన్ లో ఉన్నటువంటి మనోజ్ తన ప్రేమను గెలిపించుకోవడం కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డారని తెలుస్తోంది.

 Bhuma Mounika Shares First Pic With Manchu Manoj After Wedding Details, Vennela-TeluguStop.com

ఇలా ఎన్నో ఇబ్బందులు నడుమ తన ప్రేమను గెలిపించుకున్న మనోజ్ మౌనిక మెడలో మూడు ముళ్ళు వేశారు.

ఇలా వివాహం తర్వాత ఈ దంపతులు పలు ఆలయాలను సందర్శిస్తూ ఎంతో సందడి చేస్తున్నారు ఇకపోతే వెన్నెల కిషోర్(Vennela Kishore) వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న అలా మొదలైంది అనే కార్యక్రమానికి మనోజ్ (Manoj) దంపతులు అతిథులుగా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో భాగంగా మనోజ్ తన ప్రేమను గెలిపించుకోవడం కోసం ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి తెలియజేశారు.ఇందుకు సంబంధించిన ప్రోమో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇకపోతే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే మనోజ్ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.

మనోజ్ తో పోలిస్తే మౌనిక సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటారు.వీరి పెళ్లి జరిగే దాదాపు నెలన్నర కావస్తున్న ఇప్పటివరకు మౌనిక తన సోషల్ మీడియా వేదికగా పెళ్లికి సంబంధించిన ఎలాంటి ఫోటోలను షేర్ చేయలేదు.ఇకపోతే మొదటిసారి ఈమె తన భర్త మనోజ్ తో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.

అలా మొదలైంది టాక్ షో కి హాజరైన నేపథ్యంలో వీరిద్దరూ కలిసి ఫోటోలు దిగారు.ఇందులో మౌనిక సెలబ్రిటీ స్టైలిస్ట్ సభ్యసాచిశారీని ధరించి కూర్చిలో కూర్చుని ఉండగా మనోజ్ ఆమె వెనుక నిలబడి ఫోటోలకు ఫోజులిచ్చారు.

ఇందుకు సంబంధించిన ఈ ఫోటోని మౌనిక సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube