కేజీఎఫ్( KGF ) వంటి భారీ పాన్ ఇండియా చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు ప్రశాంత్ నీల్( Prashanth Neil ) ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సలార్ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే.ఆ సినిమా చిత్రీకరణ ముగింపు దశకు వచ్చింది.
ఇదే ఏడాది చివర్లో సలార్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.సలార్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ సినిమా ఉంటుందని అంతా భావిస్తున్నారు.
కానీ కన్నడ సినీ వర్గాల్లో మాత్రం ఆసక్తికర ప్రచారం జరుగుతుంది.ప్రశాంత్ నీల్ ఒక భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారట.
అందులో హీరోగా యష్( Yash ) నటించడంతో పాటు తెలుగు స్టార్ హీరో ఒకరు మరియు తమిళ స్టార్ హీరో ఒకరు కూడా నటించబోతున్నట్లు కన్నడ మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతుంది.ఇప్పటికే దర్శకుడు ప్రశాంత్ నీల్ స్క్రిప్ట్ రెడీ చేశాడని ముగ్గురు హీరోలకు తగ్గట్టుగా అద్భుతమైన పాత్రలను డిజైన్ చేశాడని కూడా వార్తలు వస్తున్నాయి.

అతి త్వరలోనే ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఉండే అవకాశం ఉంది.కేజీఎఫ్ చిత్రంతో వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు దక్కించుకున్న ప్రశాంత్ నీల్ తో అన్ని భాష లకు చెందిన హీరోలు నటించేందుకు ఆసక్తిగా ఉన్నారు.కానీ ఆయన ఎంపిక ఏంటి.ఆయన నిర్ణయం ఏంటా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ముగ్గురు హీరోలతో మల్టీ స్టారర్ చేస్తే ఇంకేమైనా ఉందా అంటూ సినీ ప్రేమికులు సంతోషంతో కామెంట్స్ చేస్తున్నారు.అయితే ఇప్పటి వరకు ఈ మల్టీ స్టారర్ సినిమా గురించి ఎలాంటి హడావుడి లేదు.
అసలు ఈ మల్టీ స్టారర్ ఉంటుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నారు.ఒక వేళ ప్రశాంత్ నీల్ ఆ మల్టీ స్టారర్ ను నిజంగానే తీసుకు రాగలిగితే మాత్రం కచ్చితంగా ఒక అద్భుతం అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.







