తమ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలే తమను ఎన్నికల్లో గెలిపిస్తాయనే నమ్మకం తో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ( Telangana Congress Party )ఉంది.అందుకే ఆరు గ్యారెంటీ పథకాలపై విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది.
అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని అమలు చేసి తమ చిత్తశుద్ధిని చాటుకుంటామని ధీమా గా చెబుతోంది.అయితే కర్ణాటకలో కాంగ్రెస్ ఇదే విధంగా హామీలు ఇచ్చి వాటిని విస్మరించిందని , 6 గ్యారంటీ పథకాలను అమలు చేసినా కొద్దిరోజుల్లోనే వాటికి రకరకాల కండిషన్లు పెట్టి ఆ ఆరు గ్యారెంటీలను విస్మరిస్తారు అని బిఆర్ఎస్, బిజెపిలు( BRS BJP ) తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో, సీఎల్పీ నేత మల్లు భట్టు విక్రమార్క వినూత్న రీతిలో ఈ ఆరు గ్యారెంటీ పథకాలపై నిర్ణయం తీసుకున్నారు.
ఈ మేరకు కాంగ్రెస్( Congress ) ప్రకటించిన ఆరు గ్యారెంటీలపై మల్లు బట్టు విక్రమార్క ( Mallu Bhatti vikramarka ) అఫిడవిట్ హామీతో పాటు ప్రమాణం చేయడం సంచలనంగా మారింది.ఎన్నికల ప్రచార గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో నియోజకవర్గ ప్రజలకు భట్టి విక్రమార్క చేసిన ప్రమాణం, రాసిన బాండ్ పేపర్ పై చర్చ జరుగుతోంది.ఓటర్లకు పార్టీ తరపునే కాకుండా వ్యక్తిగతంగా హామీ, భరోసా ఇచ్చే విధంగా భట్టి విక్రమార్క చేసిన ప్రమాణం, రాసిన బాండ్ పేపర్ ఆసక్తికరంగా మారింది.ఈ మేరకు వంద రూపాయల బాండ్ పేపర్ పై ప్రజలకు చేసే సేవ గురించి రాసి ఇచ్చారు.
అలాగే గుడిలో ప్రమాణం చేశారు. అక్కడే బాండ్ పేపర్ పై దేవుడు ఎదుట సంతకం చేశారు.
తెలుగు , ఇంగ్లీష్ రెండు భాషల్లోనూ అఫిడవిట్ విడుదల చేశారు.
” భట్టి విక్రమార్క అను నేను ఎమ్మెల్యేగా గెలవడమే కాదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీలను అమలు చేస్తామని , అందరికీ న్యాయం చేస్తానని , సమస్యలను పరిష్కరిస్తానని , సంక్షేమ పథకాలు అర్హులు అందరికీ ఇస్తానని , నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటాను అంటూ బాండ్ పేపర్ రాసి ఇచ్చారు .నోటి మాట ద్వారా ఓటర్ లను ఆకట్టుకునే విధంగా భట్టి విక్రమార్క ప్రయత్నం చేస్తున్నారు .జగిత్యాల నుంచి పోటీ చేస్తున్న జీవన్ రెడ్డి కూడా ఇదే విధంగా బాండ్ పేపర్ రాసిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని జీవన్ రెడ్డి బాండ్ పేపర్ లో రాసి ఇచ్చారు.