ఏపీ సీఎం జగన్ ఈనెల 30న నంద్యాల, వైఎస్ఆర్ కడప జిల్లాలకు వెళ్లనున్నారు.ఈ పర్యటనలో భాగంగా అవుకు రెండో టన్నెల్ ను సీఎం జగన్ జాతికి అంకితం చేయనున్నారు.
తరువాత కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాల్లో సీఎం జగన్ పాల్గొననున్నారు.ఈ మేరకు 30వ తేదీ ఉదయం 10 గంటలకు ముందుగా అవుకు మండలం మెట్టుపల్లికి వెళ్లనున్నారు.
అక్కడి నుంచి రెండవ టన్నెల్ సైట్ కు చేరుకోనున్న సీఎం జగన్ నీటిని విడుదల చేసి రెండవ టన్నెల్ ను జాతికి అంకితం చేయనున్నారు.ఫోటో ఎగ్జిబిషన్ పరిశీలన అనంతరం ఫైలాన్ ను ఆవిష్కరిచనున్నారు.
తరువాత కడపకు వెళ్లనున్న సీఎం జగన్ పెద్ద దర్గా ప్రధాన ఉరుసు ఉత్సవాల్లో పాల్గొననున్నారు.అనంతరం తాడేపల్లికి తిరుగు పయనం కానున్నారు.







