నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) హీరోగా కాజల్ హీరోయిన్ గా రూపొందిన భగవంత్ కేసరి సినిమా( Bhagwant Kesari movie ) భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.ఇప్పటికే వంద కోట్ల వసూళ్లు నమోదు చేసిన ఈ సినిమా ముందు ముందు మరిన్ని రికార్డు లను బ్రేక్ చేయబోతుంది అంటూ అభిమానులు నమ్మకంగా ఉన్నారు.
రెండో వారం ఎంటర్ అవ్వబోతున్న నేపథ్యం లో మేకర్స్ లైట్ తీసుకోకుండా ప్రమోషన్ కార్యక్రమాలు కంటిన్యూ చేస్తున్నారు.ఇప్పటికే బాలయ్య తో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.
అయితే బాలయ్య లేకుండా ఇప్పుడు భగవంత్ కేసరి సినిమా ను ప్రమోట్ చేస్తున్నారు.భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా కు మంచి రెస్పాన్స్ వస్తున్న నేపథ్యం లో దర్శకుడు అనిల్ రావిపూడి( Anil Ravipudi ) మరియు నటి శ్రీ లీల ఈ సినిమా ప్రమోషన్ లో పాల్గొంటున్నారు.
బాలకృష్ణ లేకుండానే సినిమా వేడుక జరుగడం ను అభిమానులు నిరుత్సాహంకు గురి చేస్తోంది.

అయితే సినిమా ను రెండో వారం లో కూడా మంచి వసూళ్లు సాధించే విధంగా ప్లాన్ చేస్తున్న దర్శకుడు అనిల్ రావిపూడికి అభినందనలు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.బాలకృష్ణ మరియు కాజల్ అగర్వాల్( Kajal Aggarwal ) లేకుండా నే సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.వారు కూడా ఒకటి రెండు రోజుల పాటు వస్తే బాగుంటుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి బాలకృష్ణ మరియు ఇతర ముఖ్యులు లేకుండా భగవంత్ కేసరి టీమ్ సందడి చేస్తున్నారు.మరి ఈ సందడి తో వసూళ్లు నమోదు అయ్యేనా చూడాలి.బాలయ్య మరియు అనిల్ రావిపూడి కాంబో మూవీ అనగానే చాలా మంది ఎంటర్టైన్మెంట్ ను ఆవించారు.కానీ మొత్తం రివర్స్ అయింది.
ఇప్పటి వరకు సినిమా కు సంబంధించిన వసూళ్లు భారీగా నమోదు అవ్వడం చూస్తూ ఉంటే కచ్చితంగా ముందు ముందు మంచి వసూళ్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.