ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏడాదిన్నర ఇంట్లోనే ఉన్నా.. ఆయనకు రుణపడి ఉంటానంటూ?

బెల్లంకొండ శ్రీనివాస్( Bellamkonda Srinivas )హీరోగా వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఛత్రపతి సినిమా మరికొన్ని రోజుల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది.ట్రైలర్ ఇంప్రెస్ చేసేలా ఉండగా ఈ సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్ సక్సెస్ సాధిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

 Bellamkonda Srinivas Comments Goes Viral In Social Media Details Here,bellamkond-TeluguStop.com

బెల్లంకొండ శ్రీనివాస్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నా తండ్రి ప్రొడ్యూసర్ కావడం వల్ల నేను సినిమాల్లోకి సులువుగానే వచ్చానని అందరూ అనుకుంటారని బెల్లంకొండ శ్రీనివాస్ చెప్పుకొచ్చారు.

Telugu Alludu Seenu, Chatrapathi, Tollywood-Movie

నా డెమో వీడియో చూసిన తర్వాత అల్లుడు శీను సినిమా( Alludu Seenu )లో నటించడానికి సమంత, తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఆయన కామెంట్లు చేశారు.నా హార్డ్ వర్క్ వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నానని ఆయన చెప్పుకొచ్చారు.ఆ సమయంలో నాన్న నిర్మించిన ఒక సినిమా ఫ్లాప్ అయిందని డిస్ట్రిబ్యూటర్ గా కూడా నాన్నకు 8 సినిమాల ఫలితాలు బాధ పెట్టాయని బెల్లంకొండ శ్రీనివాస్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఆ సమయంలో కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురు కావడంతో ఏం చేయాలో అర్థం కాలేదని ఆయన చెప్పుకొచ్చారు.ఆ సమయంలో ఒత్తిడి పెరిగి ఆఫర్లు వచ్చినా సినిమాలు చేయలేదని బెల్లంకొండ శ్రీనివాస్ కామెంట్లు చేశారు.

ఏడాదిన్నర పాటు ఇంట్లో ఉన్నానని ఆ తర్వాత తక్కువ బడ్జెట్ లో రెండో మూవీ చేశానని ఆయన చెప్పుకొచ్చారు.జయ జానకి నాయక( Jaya Janaki Nayaka ) సినిమా వల్ల నేను నిలదొక్కుకున్నానని బెల్లంకొండ శ్రీనివాస్ అన్నారు.

Telugu Alludu Seenu, Chatrapathi, Tollywood-Movie

ఆ సమయంలో నాతో సినిమా చేసిన బోయపాటి శ్రీను( Boyapati Srinu )కు రుణపడి ఉంటానని ఆయన తెలిపారు.టాలీవుడ్ లో ఇమేజ్ క్రియేట్ చేసుకోవడానికి తొలినాళ్ల నుంచి కష్టపడుతున్నానని బెల్లంకొండ శ్రీనివాస్ చెప్పుకొచ్చారు.నా సినిమాలు హిందీలో డబ్ అయ్యి సక్సెస్ అయ్యాయని ఆయన తెలిపారు.ఎక్కడికి వెళ్లినా ప్రజలు గుర్తు పడుతున్నారని బెల్లంకొండ శ్రీనివాస్ పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube