గత కొన్ని నెలలలో బాగా పాపులర్ అయ్యి సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీ స్టేటస్ అందుకున్న వాళ్లలో బర్రెలక్క శిరీష ఒకరు.ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోని శిరీష( Barrelakka Sirisha ) ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఆమె అలా ప్రకటన చేయడం ఎంపీగా పోటీ చేసే బర్రెలక్కకు డబ్బులెక్కడివి అనే ప్రశ్న ఎదురవుతూ ఉండటం గమనార్హం.ఈ ప్రశ్న ఎదురుకావడంతో శిరీష స్పందించి క్లారిటీ ఇచ్చారు.
నాకు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కొంత అమౌంట్ ఉందని దానిని నేను అడ్జస్ట్ చేసుకుంటానని ఆమె చెప్పుకొచ్చారు.నాన్న మెంటల్ కండీషన్ సరిగ్గా లేదని అందువల్లే ఆయన నా గురించి ఇష్టానుసారం కామెంట్లు చేశారని బర్రెలక్క శిరీష వెల్లడించారు.
నాగర్ కర్నూల్( Nagarkurnool ) నుంచి నేను ఎంపీగా పోటీ చేస్తున్నానని ఆమె చెప్పుకొచ్చారు.మా నాన్న మమ్మల్ని నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిపోయాడని శిరీష అన్నారు.

డబ్బులు ఇచ్చి నాన్నతో తప్పుగా ప్రచారం చేయించారని ఆమె కామెంట్లు చేశారు.నాన్న చేసిన పనులలో ఒక్క మంచి పని కూడా లేదని శిరీష వెల్లడించారు.రావడం, గొడవ పడటం, కొట్టడం నాన్న చేసేవారని నాన్న గురించి తప్పుగా ప్రచారం చేయలేదని ఆమె తెలిపారు.నాకు సపోర్ట్ చేసే వ్యక్తి దొరికితే నేను పెళ్లి చేసుకుంటానని బర్రెలక్క శిరీష అభిప్రాయం వ్యక్తం చేశారు.

నా తండ్రిని నేను చీదరించుకుంటానని శిరీష చెప్పుకొచ్చారు.మాకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ( Fast food center )ఉందని ఆమె వెల్లడించారు.నాన్న కొన్నిరోజులు మంచిగా ఉంటాడని డబ్బులు రాగానే మారిపోతాడని శిరీష అన్నారు.నాన్న మంచిగా మారతాడని అనుకున్నామని కానీ మారలేదని శిరీష తెలిపారు.బర్రెలక్క శిరీష చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.బర్రెలక్క ఎంపీగా విజయం సాధిస్తారో లేదో చూడాల్సి ఉంది.