వినాశకాలే విపరీతబుద్ధి అంటే ఇదే.. అబ్బాయి కోసం తన్నుకు చస్తున్న అమ్మాయిలు!

రొటీన్ కి భిన్నం అని సరిపెట్టుకోవాలా లేక వినాశకాలే విపరీతబుద్ధి అని అనాలో ఒక్కోసారి తెలియనే తెలియదు.బేసిగ్గా అమ్మాయి కోసం అబ్బాయిలు కొట్టుకున్న ఘటనలు మనం అనేకం చూస్తుంటాం.

 Bangalore Bishop Cotton School Girls Fight For Boyfriend Details, Girls, Fightin-TeluguStop.com

అయితే ఈ మధ్యకాలంలో, మాకేం తక్కువ అని అమ్మాయిలు అనుకున్నారో ఏమో గాని, అబ్బాయిలు గురించి అమ్మాయిలు కొట్టుతున్న సంఘటనలు అనేకం జరుగుతున్నాయి.తాజాగా బెంగుళూర్ లో జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బెంగుళూరులోని ఓ కాన్వెంట్ స్కూల్ అమ్మాయిలు ఒకరిపై ఒకరు పడి కొట్టుకున్నారు.బిషప్ కాటన్స్ గాళ్స్ స్కూల్లో ఈ సంఘటన జరగగా, తాజాగా వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళితే, ఓ అబ్బాయితో డేటింగ్ విషయంలో అమ్మాయిల్లోని 2 గ్రూపుల మధ్య గొడవ రేగినట్టుగా తెలుస్తోంది.అయితే ఒక అబ్బాయి కోసం ఇద్దరమ్మాయిల విషయంలో ఈ గొడవ జరిగిందా లేక, ఆ అబ్బికోసం ఏకంగా మిగతా గుంపులోని వారు జలస్ ఫీల్ అయి కొట్టుకుంటున్నారా అనే విషయంపైన ఇంకా క్లారిటీ రావలసి వుంది.

మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.కాన్వెంట్ విద్యను ఎంతో గొప్పగా ఊహించుకొని పంపించే తల్లిదండ్రులు మాత్రం ఇలాంటి సంఘటనలు చూశాక మానసికంగా కృంగిపోక తప్పదు.

ఇక ఇక్కడి వీడియోలో అమ్మాయిలంతా జుట్లు పట్టుకొని, కర్రలతో బాదుకోవడం మనం చూడవచ్చును.కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో బండబూతులు తిట్టుకుంటున్నారు.నేటి సమాజంలో విలువైన విద్య దొరకడమే కష్టం.ఇలాంటి తరుణంలో పాఠశాలలలో జరుగుతున్న పరిణామాలు విద్యార్థి భవితవ్యాన్ని నాశనం చేస్తున్నాయి.ఇలాంటి చర్యల పట్ల సదరు యాజమాన్యాలు శ్రద్ధ చూపకపోతే రేపటి తరాలు నాశనమయ్యే అవకాశం లేకపోలేదు.ఇక సదరు వీడియోని చూసి నెటిజన్లు రకరాలుగా స్పందిస్తున్నారు.

అమ్మాయిలకు కొవ్వెక్కింది అని ఒకరంటే, అమ్మాయిలు అభివృద్ధి చెందారు అనడానికి ఇదే ఉదాహరణ అని కొంతమంది చెవాక్కులు పేల్చుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube