తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ డిస్మిస్ అయింది.ఈ మేరకు పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ ను హన్మకొండ కోర్టు కొట్టివేసింది.
టెన్త్ క్వశ్చన్ పేపర్ లీక్ కేసులో బండి సంజయ్ బెయిల్ ను రద్దు చేయాలంటూ పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.ఇందులో భాగంగానే బండి సంజయ్ విచారణకు సహకరించడం లేదని వాదనలు వినిపించారు.
అయితే పీపీ వాదనలతో విభేదించిన న్యాయస్థానం పిటిషన్ ను డిస్మిస్ చేసింది.