బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు.తెలంగాణలో బజరంగ్ దళ్ ను నిషేధించే కుట్ర జరుగుతోందని తెలిపారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ లు కలిసి కుట్రలు పన్నుతున్నాయని బండి సంజయ్ ఆరోపించారు.బజరంగ్ దళ్ ను నిషేధిస్తే రాష్ట్రంలో జై శ్రీరాం అనలేమన్నారు.
భారత్ మాతాకి జై అంటే అరెస్ట్ చేస్తారని పేర్కొన్నారు.వారి కుట్రలను తిప్పి కొట్టడానికి రాష్ట్రంలోని హిందూవులు అంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు.