బలగం సినిమా( Balagam ) సక్సెస్ సాధించడంతో పాటు ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.దర్శకుడు వేణు( Venu ) ప్రతిభకు ఇన్ని సంవత్సరాల తర్వాత తగిన గుర్తింపు దక్కిందని కొంతమంది కామెంట్లు చేస్తుండగా తన టాలెంట్ ను వేణు ఇంతకాలం వృథా చేసుకున్నాడని మరి కొందరు చేస్తున్న కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన వేణు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
బలగం సినిమాకు చావో రేవో అని దిగానని ఆయన తెలిపారు.
సినిమా తనను మోసం చేయదని తనను నమ్మానని వేణు వెల్లడించడం గమనార్హం.గతంలో కొన్ని సినిమాలకు నేను పని చేసినా గుర్తింపు రాలేదని నన్ను కమెడియన్ గా చూశారని ఆయన చెప్పుకొచ్చారు.
రుద్రమదేవి, జై లవకుశ సినిమాలకు నేను పని చేసినా ఎవరికీ తెలియదని ఇప్పుడు టైమ్ వచ్చిందని వేణు పేర్కొన్నారు.
బలగం సినిమాకు అద్బుతమైన రివ్యూలు వచ్చాయని నా సినిమాలకు ఐదారు పేజీల రివ్యూలు వచ్చాయని ఆయన చెప్పుకొచ్చారు.నా దృష్టిలో ప్రాక్టికాలిటీ, అబ్జర్వేషన్ ను మించిన స్కూల్ లేదని వేణు అన్నారు.మన ప్రతిభకు అదృష్టం ఉండాలని మున్నా సినిమా సక్సెస్ అయ్యి ఉంటే నా కెరీర్ మరోలా ఉండేదని అదృష్టం లేకపోవడం వల్ల కెరీర్ లో ఎన్నో ఇబ్బందులు పడ్డానని ఆయన తెలిపారు.
ఇండస్ట్రీలో తిట్లు పడ్డాయని అవమానాలు పడ్డాయని ఎన్నో దెబ్బలు తగిలాయని ఆయన చెప్పుకొచ్చారు.సినిమా చూసి చిరంజీవి ఆశ్చర్యపోయారని వేణు పేర్కొన్నారు.చిన్నప్పటి నుంచి చిరంజీవిని చూసి పెరిగాయని ఆయన ఒక ఐకాన్ అని నా దృష్టిలో ఆయన దేవుడు అని వేణు పేర్కొన్నారు.దిల్ రాజు గారి బ్యానర్ లో తాను తర్వాత సినిమా చేస్తానని బలగం సినిమా ప్రభావం నాపై ఎక్కువగా ఉందని వేణు తెలిపారు.