మరోసారి యాక్టింగ్ లో చెలరేగిన బన్నీ.. ''ఇది పుష్ప గాడి రూలు'.. తగ్గేదేలే!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) రేపు పుట్టిన రోజు జరుపుకో నున్నారు.ఏప్రిల్ 8న అల్లు అర్జున్ తన పుట్టిన రోజును జరుపుకో నున్నాడు.

 Pushpa The Rule Allu Arjun Gives Goosebumps As Pushpa In A Special Teaser Detail-TeluguStop.com

ఈసారి అల్లు అర్జున్ పుట్టిన రోజు నాడున వచ్చే బ్లాస్టింగ్ అప్డేట్ కోసం ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ (Allu Arjun Fans) అంతా ఎదురు చూస్తున్నారు.ఈ క్రమంలోనే మేకర్స్ కూడా అదిరిపోయే వీడియో రిలీజ్ చేసారు.

అన్నట్టుగానే రెండు రోజుల క్రితం ఈ సినిమా నుండి ఇంట్రెస్టింగ్ వీడియోను ఫ్యాన్స్ ఎవ్వరూ ఊహించని అప్డేట్ ను అందించారు.వేర్ ఈజ్ పుష్పరాజ్ అనే పేరుతో చిన్న వీడియో రిలీజ్ చేసి క్యూరియాసిటీ పెంచేసిన సుకుమార్ ఈ రోజు 3 నిముషాల నిడివి ఉన్న వీడియోను రిలీజ్ చేసి ఫ్యాన్స్ కు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు.

ఈ వీడియో మొత్తం పుష్పరాజ్ ను హైలెట్ చేసారు.

మొదట్లో పుష్పరాజ్ ను మరణించినట్టు చూపించిన ఆ తర్వాత ఈయన స్టైలిష్ ఎంట్రీ, డైలాగ్స్ అన్ని కూడా ఆకట్టు కున్నాయి.ఈసారి కూడా పార్ట్ 1 కంటే మరింత బాగా అల్లు అర్జున్ యాక్టింగ్ లో గ్రేస్ చూడవచ్చు.ఇక చివరిలో ”ఇది పుష్ప గాడి రూలు” అంటూ అల్లు అర్జున్ డైలాగ్ తో ముగించాడు.

ఈ వీడియో ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇస్తుంది.

అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్ ఘన విజయం సాధించింది.దీంతో పార్ట్ 2 పుష్ప ది రూల్ (Pushpa: The Rule) ను మరింత గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను బడ్జెట్ పరంగా ఎక్కడ ఎటువంటి లోటు లేకుండా గ్రాండ్ నిర్మాణ విలువలతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఈ సినిమాపై పాన్ ఇండియా వ్యాప్తంగా భారీ హైప్ నెలకొంది.ఇక ఈ వీడియోతో అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube