మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) తాజాగా భోళా శంకర్( Bhola Shankar ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆదరించలేకపోయింది.
ఈ సినిమా డిజాస్టర్ కావడంతో ఈ సినిమా గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఇండస్ట్రీలో ప్రేక్షకుల ముందుకు వచ్చే సినిమాలన్నీ కూడా హిట్ కావాలని రూలేమీ లేదు కొన్ని సందర్భాలలో సినిమాలు ఇలాంటి చేదు ఫలితాలను కూడా అందిస్తూ ఉంటాయి.
ఈ క్రమంలోనే ఈ సినిమా కూడా చేదు అనుభవాన్ని ఎదుర్కొంది.
ఇకపోతే తాజాగా ఈ సినిమా గురించి అలాగే హీరో చిరంజీవి గురించి ఓ వార్త వైరల్గా మారింది.ఈ సినిమా విడుదలకు ముందు చిరంజీవి నిర్మాత అనిల్ సుంకర ( Anil Sunkara ) పట్ల కాస్త కఠినంగా వ్యవహరించారని తనకు ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ మొత్తం ఇచ్చే తీరాల్సిందేనని చెప్పడంతో అనిల్ సుంకర చేసేదేమీ లేక తన ఆస్తులు కూడా అన్ని చిరంజీవికి ఇవ్వాల్సిన పేమెంట్ మొత్తం ఇచ్చారంటూ ఓ వార్త వైరల్ గా మారింది.అయితే ఈ వార్తపై తాజాగా బేబీ డైరెక్టర్ సాయి రాజేష్( Sai Rajesh ) స్పందిస్తూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా ఈయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఇకపై అయినా చిరంజీవి గురించి వచ్చే ఈ చెత్త వార్తలను ఆపేయండి సినిమా నచ్చితే నచ్చింది లేకపోతే లేదు అని చెప్పండి అంతేకానీ ఇలాంటి రూమర్స్ మాత్రం క్రియేట్ చేయొద్దు అంటూ ఈయన తెలియజేశారు.
చిరంజీవి గారు అనిల్ సుంకర నుంచి ముక్కు పిండి మరి తన పేమెంట్ వసూలు చేసుకున్నారంటూ వార్తలు వస్తున్నాయి ఇందులో ఏ మాత్రం నిజం లేదని తెలిపారు.చిరంజీవి నిర్మాతలకు ఎంతో మర్యాద ఇచ్చే వ్యక్తి.చిరంజీవి ఆఫీస్ లో నిర్మాత అనిల్ సుంకర వెయిట్ చేస్తున్నారు అంటే స్వయంగా ఆయనని పిలిపించి ఆయన కూర్చోవడానికి సోఫా అరెంజ్ చేయడమే కాకుండా స్వయంగా కాఫీ అందించిన వ్యక్తి చిరంజీవి గారు అంటూ ఈయన తెలిపారు.
నిజం చెప్పులేసుకుని లోపు అబద్ధం ఊరంతా చుట్టేస్తుంది.ఈ వార్తలని చూసి చాలా బాధతో నేను అనిల్ గారు దగ్గర పని చేసే ఒక వ్యక్తికి ఫోన్ చేసి అడిగి విషయం తెలుసుకున్నాను.
మా బాస్ మీరనుకున్నట్లుగా కాదు.ఆయన వేరే.మా బాస్ చిరంజీవి గారిని చూసి నేను గర్వపడుతున్నాను అంటూ ఈయన చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.