ప్రముఖ నటి జ్యోతి ఒక సందర్భంలో కమెడియన్ ఏవీఎస్ గురించి తప్పుగా కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.ఆ కామెంట్ల గురించి ఏవీఎస్ కొడుకు ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తూ నేను నిర్మించిన సినిమాకు లాభం రాలేదని నష్టం రాలేదని తెలిపారు.
సొంతంగా పెట్టుబడి పెట్టి ప్రతిభ చూపించుకోవాలని భావిస్తే ఇండస్ట్రీలోకి రావచ్చని ఆయన అన్నారు.సినిమా ఇండస్ట్రీలో ఎవరిది వాళ్లు చూసుకుంటారని ప్రదీప్ పేర్కొన్నారు.
సినిమా గురించి ప్రమోషన్స్ కు చిరంజీవి గారిని పిలిస్తే ఆయన రావాల్సిన అవసరం లేదని అయితే ఆయనకు ప్రేక్షకుల్లో క్రేజ్ ఉండటంతో ఆయన సినిమా ప్రమోషన్స్ కు హాజరై తన వంతు సహాయసహకారాలు అందిస్తున్నారని ప్రదీప్ తెలిపారు.కరోనా ఎన్నో గుణపాఠాలు నేర్పిందని ఆయన పేర్కొన్నారు.
జ్యోతి విషయంలో నాన్నగారికి ఆర్టిస్ట్ కనిపించలేదని ఆవిడకు మా నాన్నగారి జోకులలో పంచ్ కనిపించలేదని ప్రదీప్ చెప్పుకొచ్చారు.
అది ఆవిడ సమస్య అని నాన్నగారి కొన్ని కోట్ల మందిని నవ్వించారని ప్రదీప్ పేర్కొన్నారు.
చనిపోయిన వాళ్ల గురించి తప్పుగా కామెంట్లు చేసేవాళ్లను నేను లెక్కలోకి కూడా తీసుకోనని ప్రదీప్ చెప్పుకొచ్చారు.ఏవీఎస్ గారు ఎన్నో బాధ్యతలు నిర్వహించి మంచి పేరు సంపాదించుకున్నారని ఆయన వెల్లడించారు.
ఇప్పటికీ నాన్న కామెడీ సీన్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని ప్రదీప్ అన్నారు.
మనిషి చనిపోయిన తర్వాత అతని గురించి మాట్లాడకూడదని ఆయన వెల్లడించారు.చనిపోయిన తర్వాత తప్పుగా మాట్లాడటం నా దృష్టిలో పెద్ద తప్పు అని పేర్కొన్నారు.చనిపోక ముందు మాట్లాడి ఉంటే కరెక్ట్ ఆన్సర్ వస్తుందని ప్రదీప్ అన్నారు.
నాన్న జీవితంలో ఎన్నో ఘట్టాలు ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు.నాన్న లెజెండ్ అని ప్రదీప్ చెప్పుకొచ్చారు.