ఆస్ట్రేలియా టీ 20 కెప్టెన్ ఆరోన్ ఫించ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఇంటర్నేషనల్ క్రికెట్ కు ఫించ్ రిటైర్మెంట్ ప్రకటించారు.
గత సంవత్సరమే వన్డే కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ఫించ్ .2021లో దేశానికి ఐసీసీ టీ20 ప్రపంచకప్ అందించారు.ఆస్ట్రేలియా టీ20 క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా రికార్డులకు ఎక్కిన ఫించ్…బీబీఎల్ లో మెల్ బోర్న్ రెనేగేడ్స్ కు ప్రాతినిధ్యం వహించనున్నారు.
2024లో జరిగే టీ20 ప్రపంచకప్ వరకు ఆడటం సాధ్యం కాదన్న విషయం తెలుసన్న ఫించ్.రిటైర్ కావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.అందుకు ఇదే సరైన సమయమని భావించినట్లు పేర్కొన్నారు.
2011వ సంవత్సరంలో ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ తో అంతర్జాతీయ అరంగేట్రం చేశారు ఫించ్.తన కెరియర్ లో 8 వేల 804 పరుగులు చేశారు.17 వన్డే సెంచరీలతో పాటు రెండు టీ20 శతకాలు సాధించారు.చివరి అంతర్జాతీయ మ్యాచ్ ను ఐర్లాండ్ తో ఆడిన ఫించ్.63 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచారు.36 ఏళ్ల ఫించ్ తన కెరియర్ లో ఐదు టెస్టులు, 146 వన్డేలతో పాటు 103 టీ20లు ఆడిన విషయం తెలిసిందే.