వైద్యులకు రక్షణ కవచం: ఎన్ఆర్ఐ ఇంజనీర్ దాతృత్వం.. భారత్‌లోని ఆసుపత్రులకు చేరిన అధునాతన ఫేస్ షీల్డ్‌లు

కరోనా సెకండ్‌వేవ్‌తో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న భారత్‌ను ఆదుకునేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకొస్తూనే వుంది.అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, బ్రిటన్, జర్మనీ, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, చైనా తదితర దేశాలతో పాటు కార్పోరేట్‌లు వీలైనంత సాయం చేస్తున్నారు.

 Aurangabad Hospital Gets Advanced Face Shields From Non-profit Organisation In U-TeluguStop.com

ఇక ప్రవాస భారతీయులు, సంఘాలు కూడా జన్మభూమి కోసం నడుం బిగించారు.వ్యక్తిగత సాయంతో పాటు స్వచ్ఛంద సంస్థల తోడ్పాటుతో మాతృదేశానికి అండగా నిలబడుతున్నారు.

ప్రధానంగా దేశాన్ని తీవ్రంగా ఇబ్బందిపెడుతున్న ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, వెంటిలేటర్లు, మందులు, ఇతర వైద్య పరికరాలను విరాళంగా అందజేస్తున్నారు.

కరోనా నుంచి మానవాళిని రక్షించడంలో వైద్యులు, వైద్య సిబ్బది పాత్ర మరువలేనిది.

చికిత్స లేని రోగమని తెలిసినా.దగ్గరకు వెళితే తమ ప్రాణాలకే ముప్పు అని అవగాహన వున్నా రోగుల్ని కాపాడేందుకు డాక్టర్లు తీవ్రంగా శ్రమించారు.

ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఎందరో వైద్యులు మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు.అలాంటి ప్రాణదాతలను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా వుంది.

ఈ నేపథ్యంలోనే అమెరికాకు చెందిన ఎన్ఆర్ఐ ఇంజనీర్ ఒకరు భారత్‌లోని ఓ ఆసుపత్రికి అత్యాధునిక ఫేస్‌ షీల్డ్‌లను విరాళంగా పంపారు.

మహారాష్ట్ర ఔరంగాబాద్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి అమెరికాలోని ఎన్జీవో సంస్థ నుంచి 250 అధునాతన ఫేస్‌షీల్డ్‌లు వచ్చాయి.

దీనిని భారత సంతతికి చెందిన ఏరోస్పేస్ ఇంజనీర్ ఓ స్వచ్చంద సంస్థ సాయంతో ఇక్కడకు పంపారు.గూగుల్‌లో సీనియర్ ప్రొడక్ట్ మేనేజర్‌గా వున్న సంజయ్ వాకిల్ తల్లి అక్కడే పుట్టారు.

ఆమెతో పాటు ఎందరో బంధుమిత్రులు ఔరంగాబాద్‌లోనే వున్నారు.ఈ నేపథ్యంలోనే వైద్య సిబ్బంది కోసం పునర్వియోగపరచదగిన, శానిటైజబుల్ ఫేస్‌షీల్డ్‌లను తయారు చేస్తున్న ‘MasksOn.org,’ని సంప్రదించి తన తరపున విరాళాలను అందించారు.

బయో కాంపాజిబుల్ ప్లాస్టిక్‌తో తయారు చేసిన ఈ స్నార్కెల్ మాస్కులు పునర్వినియోగించుకోవచ్చు అలాగే వేగంగా ధరించవచ్చు.వీటికి అదనంగా బ్యాక్టీరియా, వైరల్ ఫిల్టర్‌ను అమర్చడం వల్ల డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలకు రక్షణను అందిస్తాయి అని ‘MasksOn.org,’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వకీల్ అన్నారు.

మొత్తం 36000 ఫేస్‌షీల్డ్‌లను అమెరికాతో పాటు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు ఈ ఎన్జీవో సంస్థ పంపింది.భారత్‌లో ఔరంగాబాద్, విశాఖపట్నం నగరాలకు ఈ విరాళాలు అందాయి.

Telugu Corona, India, Mgm Ngo, Sanjay Vakil, Seniorproduct-Telugu NRI

తయారీ, రవాణా ఖర్చును పరిగణనలోనికి తీసుకుంటే ప్రతి ఒక్క ఫేస్‌షీల్డ్ ధర 30 డాలర్ల నుంచి 35 డాలర్ల వరకు వుంటుందని సంజయ్ తెలిపారు.వీటిని తాము ఆసుపత్రులకు పూర్తి ఉచితంగా పంపిణీ చేస్తామని ఆయన వెల్లడించారు.విరాళాల ద్వారా సేకరించిన రెండు మిలియన్ డాలర్లను 100 శాతం ఫేస్‌షీల్డ్‌ల కోసమే ఖర్చు చేస్తామని సంజయ్ పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube