ఆర్ఆర్ఆర్ సినిమా అలా చేయకపోతే ప్రేక్షకులకు నచ్చదు: రాజమౌళి

దర్శకధీరుడు ఎస్.ఎస్.

 Audiences Will Not Like Rrr Movie If It Does Not Do Like That By Rajamouli, Raja-TeluguStop.com

రాజమౌళి పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా కోసం దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు, ఎన్టీఆర్ అభిమానులు, చరణ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఇక కొద్ది రోజులలో ఈ నిరీక్షణకు తెరపడుతుందని చెప్పవచ్చు.

గత మూడు సంవత్సరాల నుంచి ప్రేక్షకులను ఊరిస్తున్న ఈ సినిమా ఈనెల 25వ తేదీన విడుదల కానుంది.ఈ క్రమంలోనే పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఎన్నో ఇంటర్వ్యూల్లో పాల్గొన్న రాజమౌళికి తరచూ ఒకే ప్రశ్న ఎదురవుతుంది.

రాజమౌళి ఈ సినిమాని ఎన్టీఆర్, రామ్ చరణ్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.

ఈ విధంగా వీరిద్దరిని ఎలా బ్యాలెన్స్ చేశారనే ప్రశ్న తరచూ రాజమౌళికి తలెత్తుతుంది.ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూ సందర్భంగా రాజమౌళి ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ… ఈ సినిమా సిద్ధం చేసుకున్న తర్వాత ఈ సినిమా విషయంలో తాను కేవలం ఎమోషనల్ బ్యాలెన్స్ గురించి మాత్రమే ఆలోచించానని, పంచ్ డైలాగ్స్ విషయంలో కాదని రాజమౌళి వెల్లడించారు.

Telugu Rajamouli, Telugu, Tollywood-Movie

ఈ విధంగా ఎమోషనల్ బ్యాలెన్స్ లేకపోతే ఆర్ఆర్ఆర్ సినిమా ప్రేక్షకులకు నచ్చదని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా రాజమౌళి వెల్లడించారు.ఇక ఈ సినిమాలో నటించే హీరోల మధ్య మంచి స్నేహ బంధం ఉంటుంది.అందుకే నిజ జీవితంలో కూడా మంచి స్నేహ బంధం ఉన్నటువంటి రామ్ చరణ్, ఎన్టీఆర్ లను ఈ సినిమా కోసం ఎంపిక చేశానని, ఎమోషనల్ సన్నివేశాలు పంచ్ డైలాగ్స్ అన్నీ కూడా ఎంతో బ్యాలెన్స్ గా ఉన్నాయని, ఇలా ఉన్నప్పుడే ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని ఈ సందర్భంగా రాజమౌళి తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube