ఆర్ఆర్ఆర్ సినిమా అలా చేయకపోతే ప్రేక్షకులకు నచ్చదు: రాజమౌళి

దర్శకధీరుడు ఎస్.ఎస్.

రాజమౌళి పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా కోసం దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు, ఎన్టీఆర్ అభిమానులు, చరణ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఇక కొద్ది రోజులలో ఈ నిరీక్షణకు తెరపడుతుందని చెప్పవచ్చు.గత మూడు సంవత్సరాల నుంచి ప్రేక్షకులను ఊరిస్తున్న ఈ సినిమా ఈనెల 25వ తేదీన విడుదల కానుంది.

ఈ క్రమంలోనే పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఎన్నో ఇంటర్వ్యూల్లో పాల్గొన్న రాజమౌళికి తరచూ ఒకే ప్రశ్న ఎదురవుతుంది.

రాజమౌళి ఈ సినిమాని ఎన్టీఆర్, రామ్ చరణ్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.

ఈ విధంగా వీరిద్దరిని ఎలా బ్యాలెన్స్ చేశారనే ప్రశ్న తరచూ రాజమౌళికి తలెత్తుతుంది.

ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూ సందర్భంగా రాజమౌళి ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ.

ఈ సినిమా సిద్ధం చేసుకున్న తర్వాత ఈ సినిమా విషయంలో తాను కేవలం ఎమోషనల్ బ్యాలెన్స్ గురించి మాత్రమే ఆలోచించానని, పంచ్ డైలాగ్స్ విషయంలో కాదని రాజమౌళి వెల్లడించారు.

"""/"/ ఈ విధంగా ఎమోషనల్ బ్యాలెన్స్ లేకపోతే ఆర్ఆర్ఆర్ సినిమా ప్రేక్షకులకు నచ్చదని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా రాజమౌళి వెల్లడించారు.

ఇక ఈ సినిమాలో నటించే హీరోల మధ్య మంచి స్నేహ బంధం ఉంటుంది.

అందుకే నిజ జీవితంలో కూడా మంచి స్నేహ బంధం ఉన్నటువంటి రామ్ చరణ్, ఎన్టీఆర్ లను ఈ సినిమా కోసం ఎంపిక చేశానని, ఎమోషనల్ సన్నివేశాలు పంచ్ డైలాగ్స్ అన్నీ కూడా ఎంతో బ్యాలెన్స్ గా ఉన్నాయని, ఇలా ఉన్నప్పుడే ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని ఈ సందర్భంగా రాజమౌళి తెలిపారు.

ఇప్పుడు పోరాటాలు చేస్తే లాభం ఏంటి ?  కేసీఆర్ ఆలోచనేంటి ?