ప‌ట్టుబ‌డితే.. జ‌గ‌న్‌కు ఎదురుదెబ్బ‌లే !వాటికి అంతం లేదా ?

ఇటీవ‌ల కాలంలో త‌ర‌చూ హైకోర్టుతో మొట్టికాయ‌లు వేయించుకుంటున్న పార్టీ ఏదైనా ఉందంటే అది వైసీపీ, సీఎం జ‌గ‌న్ అనే టాక్ వినిపిస్తోంది.ఎందుకంటే చేసిన త‌ప్పునే మ‌ళ్లీ మ‌ళ్లీ చేసి ఎదురు దెబ్బ‌లు తిన‌డం ఇందుకు నిద‌ర్శ‌నంగా నిలుస్తోంది.

 Another Trouble For Cm Jagan In High Court In Case Of Electricity Bills Details,-TeluguStop.com

ఎవ‌రైనా స‌రే చేసిన త‌ప్పు మ‌ళ్లీ చేయొద్ద‌ని తెలివైన వారు చెబుతుండ‌డం మనం చూసి ఉంటాం.అంటే కొత్త‌గా మ‌రేదైనా చేయాల‌ని దాని సారాంశం.

కానీ, వైసీపీ దీనిని మ‌రోలా అర్థం చేసుకున్న‌ట్టు క‌నిపిస్తోంది.త‌ప్పుల మీద త‌ప్పులు చేస్తూ త‌ర‌చూ హైకోర్టులో ఎదురు దెబ్బ‌లు తిన‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

మొత్తంగా ప‌రిశీలిస్తే తాను ప‌ట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న చందంగా జ‌గ‌న్ డిసైడ్ అయి ముందుకుసాగడ‌మే ఇందుకు కార‌ణ‌మ‌ని తెలుస్తోంది.

ఇప్ప‌టి వ‌రకు అనేక అంశాల్లో దెబ్బ‌తిన్న వైసీపీకి తాజాగా మ‌రో అంశంలో ఎదురుగాలి వీచింది.

విద్యుత్ ఉత్ప‌త్తి సంస్థ‌ల‌కు బిల్లులు చెల్లించాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.విద్యుత్ కొనుగోలు ఒప్పందాల ప్ర‌కారం… బిల్లులు చెల్లించాల్సి ఉన్నా… చెల్లించ‌లేదు.దీంతో విద్యుత్ ఉత్ప‌త్తిదారుల‌కు, ప్ర‌భుత్వానికి మ‌ధ్య వివాదం కొన‌సాగుతోంది.ఇప్ప‌టికే సింగిల్ బెంచ్ జ‌డ్జి తీర్పు కూడా ఇచ్చారు.

బిల్లులు త‌గ్గించి ఇవ్వాల‌ని సూచించింది.పీపీఏల‌కు వ్య‌తిరేకంగా ఏపీ ఈఆర్సీలో ప్ర‌భుత్వ పిటిష‌న్ల‌ను సైతం కొట్టిపారేయ‌డం చ‌ర్చ‌కు దారితీస్తోంది.ఇప్ప‌టికే విద్యుత్ ఉత్ప‌త్తి సంస్థ‌ల‌కు సుమారు రూ.20వేల కోట్ల బ‌కాయి ప‌డింది.

Telugu Andhra Cm Jagan, Apcm, Ap, Ap Ycp, Bills, Jagan, Ycp-Political

అయితే స‌ద‌రు కంపెనీలు సింగిల్ బెంచ్ తీర్పుకు స‌వాల్‌గా హైకోర్టును ఆశ్ర‌యించాయి.కాగా బిల్లులు త‌గ్గించాల‌న్న తీర్పును కోట్టేసింది.అలాగే విద్యుత్ బ‌కాయిల‌ను ఆరు వారాల వ్య‌వ‌ధిలో చెల్లించాల‌ని ఆదేశించింది.అయితే వైసీపీకి ఈ ఒక్క అంశమే కాదు… ప‌లు అంశాల్లోనూ త‌ర‌చూ హైకోర్టు ఎదుట భంగ‌పాటు ఎదురవుతోంది.

ఇప్ప‌టికైనా వీటి నుంచి బ‌య‌ట‌ప‌డే ప్లాన్ వైసీపీ, సీఎం జ‌గ‌న్ చేస్తే బాగుంటుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.మ‌ని వారు ఎలా స్పందిస్తారు అనేది వేచి చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube