380 అడుగుల జలపాతం అంచున సాహసం.. జారిందో బాడీ కూడా దొరకదు..?

ప్రస్తుతం ఇంటర్నెట్‌లో షాకింగ్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది.ఈ వీడియోలో, ఒక పర్యాటకురాలు ప్రపంచంలోనే అతిపెద్ద జలపాతాలలో ఒకదాని అంచున పడుకుంది, ఈ జలపాతం జాంబియా-జింబాబ్వే( Zambia-Zimbabwe ) సరిహద్దులో ఉంది.

 The Adventurer Slipped On The Edge Of The 380 Feet Waterfall And The Body Is Not-TeluguStop.com

ఈ వీడియోలో, ఆమె జలపాతం అంచున వాలి, కిందకు చూస్తున్నట్లు కనిపిస్తుంది.జలపాతం భారీ శక్తి, శబ్దం చూసేవారిని భయపెడతాయి.

ఈ స్టంట్ చాలా ప్రమాదకరమైనది.ఇలాంటి పనులు చేయవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.జలపాతాల అంచులు చాలా జారేవిగా ఉంటాయి, చిన్న తప్పు కూడా ప్రాణాంతకం కావచ్చు.ప్రపంచంలోనే అత్యంత సాహసోపేత పర్యాటకులను మాత్రమే ఈ జలపాతం ఆకర్షిస్తుంది అంటే అది ఎంత ప్రమాదకరమైన తో అర్థం చేసుకోవచ్చు.ఈ వీడియోను “Nature is Amazing” అనే ఖాతా ఎక్స్‌లో పంచుకుంది, దీనికి “380 అడుగుల జలపాతం దగ్గర నిలబడటం సాధ్యమేనని నేను ఇప్పుడే తెలుసుకున్నాను (డెవిల్స్ పూల్ – విక్టోరియా జలపాతం).” అని క్యాప్షన్ జోడించారు.

ఈ వీడియో చూసిన వారి స్పందనలు చాలా భిన్నంగా ఉన్నాయి.ఒక వ్యక్తి, “దయచేసి, ఆమె కాళ్లకు గట్టిగా తాడులు కట్టి ఉండాలని చెప్పండి!, కెమెరా ఆమె దిగువ కాళ్లను చూపించకపోవడం వల్ల ఆమె ఎలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకుందో అర్థం కావడం లేదు” అని కామెంట్ చేశాడు.మరొక వ్యక్తి, “యోసెమిటీ( Yosemite ) దగ్గర నేను నివసిస్తున్న.ఫోటో కోసం ప్రయత్నిస్తూ జలపాతాలలో పడిపోయి మరణించే వ్యక్తుల గురించి నేను తరచుగా వింటా.జారే రాళ్ళపై కొంతసేపు ఉన్న అది ఈ చివరికి పెను ప్రమాదానికి దారితీస్తుంది” అని వ్యాఖ్యానించారు.ఈ జలపాతం ఉధృతి చాలా ఎక్కువగా ఉంది జారే రాళ్లపై నీటి కారణంగా ముందుకు వెళ్లిపోయే అవకాశం ఉంది దీని వల్ల 380 అడుగుల నుంచి కింద పడితే బాడీ కూడా దొరకదు అని ఇంకొందరు అన్నారు.

ఈ వీడియో చూస్తుంటేనే భయమేస్తోంది, ఆమె ఈ స్టంట్‌ ఎలా చేసిందో అర్థం కావడం లేదు అని కొందరు అన్నారు.ఈ వీడియోను తాను ఎప్పటికీ మర్చిపోలేనని ఇంత ధైర్యం ఉన్న మహిళను తాను ఎప్పుడూ చూడలేదు కానీ ఇంకొకరు కామెంట్ చేశారు.వైరల్ అవుతున్న వీడియోను మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube