అరియానా నడుముకు ముద్దు పెట్టిన అషు రెడ్డి.. ఇదెక్కడి దారుణం అంటూ!

బిగ్ బాస్ సీజన్ 4 బోల్డ్ బ్యూటీ అరియానా గురించి అందరికీ పరిచయమే.బిగ్ బాస్ తర్వాత ఎనలేని క్రేజ్ ను సంపాదించుకొని మంచి సెలబ్రిటీ హోదాను అందుకుంది.

 Ashu Reddy Kissing Ariana Waist , Ashu Reddy , Ariana , Bigg Boss , Kissed , You-TeluguStop.com

పలు ప్రాజెక్టులలో అవకాశాలు అందుకుని ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సొంతం చేసుకున్న అరియానా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.

ఇక తన కెరీర్ ను యూట్యూబ్ లో యాంకర్ గా మొదలు పెట్టింది.నిజానికి తన కెరీర్ ఇక్కడి నుండే ప్రారంభమైంది.గతంలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేయగా.ఆమెపై వర్మ చేసిన బోల్డ్ కామెంట్లతో సెలబ్రిటీగా మారింది.

కేవలం ఒక్క ఇంటర్వ్యూతో వర్మ చేతిలో చిక్కిన అరియానా బాగా హాట్ టాపిక్ గా మారి క్రేజ్ సంపాదించుకుంది.

అలా వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 లో అవకాశం అందుకుంది.

ఇందులోనే తన పరిచయాన్ని మరింత పెంచుకుంది.ఎంట్రీ తోనే బాగా వైలెంట్ గా నిలిచింది.

అంతేకాకుండా బిగ్ బాస్ హౌస్ లో మరో కంటెస్టెంట్ సోహెల్ తో బద్ధశత్రువుగా ఉండి మరింత రచ్చ చేసింది.అలా చివరి రోజుల్లో మంచి ఫ్రెండ్స్ గా మారారు.

ఇక హౌస్ నుండి బయటకు వచ్చాక కూడా వీరి మధ్య ఫ్రెండ్ షిప్ మరింత బలపడింది.

ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసి వెళ్లేవాళ్లు.

ఇక సోషల్ మీడియాలో ఇద్దరు కలిసి దిగిన ఫోటోలను కూడా బాగా పంచుకునే వాళ్ళు.అంతే కాకుండా వీడియో కాల్స్ కూడా మాట్లాడుకునేవాళ్ళు.

దాంతో వీళ్ళ మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి.అరియానా ప్రస్తుతం వరుస షో లతో బాగా బిజీగా ఉంటుంది.

గత ఏడాది బిగ్బాస్ సీజన్ 5 లో కంటెస్టెంట్ లను ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే తాజాగా అరియానా ఓ ఈవెంట్ లో పాల్గొన్నట్లు కనిపించింది.అందులో తనతో పాటు మరో బుల్లితెర ఆర్టిస్ట్ అషు రెడ్డి కూడా ఉండగా తన తో దిగిన ఒక ఫోటోను తన ఇన్ స్టా గ్రామ్ లో తన ఫాలోవర్స్ కు పంచుకుంది.ఇక ఆ ఫోటో చూసిన నెటిజన్లు దారుణంగా నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.

ఎందుకంటే ఆ ఫోటోలో అరియానా నడుముపై అషు రెడ్డి ముద్దు పెట్టినట్లు కనిపించింది.ఇక అరియానా తన ఎక్స్ ప్రెషన్స్ తో రెచ్చిపోయింది.ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారగా.ఇదెక్కడి దారుణం అంటూ కొందరు ట్రోల్స్ చేస్తున్నారు.ఇక కొందరు ఇది చాలా హాట్ గా ఉంది అంటూ.మరికొందరు ఇది తేడాగా కనిపిస్తుంది అని అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇక అషు రెడ్డి కూడా ప్రస్తుతం బుల్లితెరపై ఓ రేంజ్ లో దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube