*మార్చి 18 న సస్పెన్స్ థ్రిల్లర్ "*డైరెక్టర్*" *విడుదల*

సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ప్రేక్షకులలో డిమాండ్ ఎప్పుడు ఉంటుంది.ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా తెరకెక్కిస్తే ఈ జోనర్ లో సినిమాలు మంచి విజయాన్ని సాధిస్తాయి.

 Ashish Gandhi’s “director” Releasing Grandly On March 18th , Ashish Gandhi-TeluguStop.com

ఆ విధంగా సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కి ప్రేక్షకులను అలరించడానికి ముస్తాబవుతున్న చిత్రం “*డైరెక్టర్*”.నాటకం సినిమా తో నటుడిగా మంచి గుర్తింపు సాధించుకున్న ఆశిష్ గాంధీ హీరోగా ఐశ్వర్య రాజ్, మరీనా, ఆంత్ర హీరోయిన్లుగా నటిస్తున్నారు.

విజన్ సినిమాస్ బ్యానర్ పై డా.నాగం తిరుపతి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.ఈ సినిమా లో నిర్మాత నాగం తిరుపతి రెడ్డి ఓ కీలక పాత్రలో కూడా కనిపించారు.దర్శక ద్వయం కిరణ్ పొన్నాడ-కార్తీక్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ కి, టీజర్ కి, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

సినిమా పై కూడా అంచనాలను పెంచాయి.రాజా ది గ్రేట్, పటాస్, సుప్రీమ్ వంటి పలు సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించిన సాయి కార్తీక్ సంగీతం సమకూర్చారు.

బి.నాగేశ్వర్ రెడ్డి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించగా ఆదిత్య వర్దిన్ ఛాయాగ్రాహకుడు గా పనిచేశారు.కాగా ఈ చిత్రాన్ని ఈ నెల 18 వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.నటీనటులు ఐశ్వర్య రాజ్, మరీనా, ఆంత్ర, జబర్దస్త్ అప్పారావు, వీరభద్రం, తిరుమలరెడ్డి, ఆర్కే, తదితరులు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube