ఆరోహి బిగ్ బాస్ 6 కంటెస్టెంట్ గా అందరికీ సుపరిచితమే.ఆరోహి యాంకరింగ్ గా ప్రముఖ న్యూస్ ఛానల్ టీవీ9 లో కెరియర్ స్టార్ట్ చేసింది.
ఈమె టీవీ9 లో ఇస్మార్ట్ న్యూస్ ద్వారా మంచి పాపులారిటీ పొందింది.ఇక పలు ఛానల్లో కూడా చేసింది.
దీంతో ఈమె భాషకు, ఈమె మాట తీరుకు మంచి ఫాలోయింగ్ రావడంతో బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో అవకాశం అందుకుంది.
కానీ నాలుగు వారాల్లోనే హౌస్ నుండి దూరం అయింది.
ఇక ఉన్న నాలుగు వారాల్లో ఆరోహి అందరితో బాగా కనెక్ట్ అయింది.తను వెళ్లేటప్పుడు అందర్నీ బాగా ఎమోషనల్ చేసింది.
ఆ తర్వాత పలు ఇంటర్వ్యూలలో పాల్గొని తన గురించి కొన్ని విషయాలు పంచుకుంటూ బిగ్ బాస్ లో జరిగిన విషయాలను తెలిపింది.
ఇక ఆరోహి సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.
తన ఫోటోలను, వీడియోలను బాగా షేర్ చేస్తూ ఉంటుంది.అంతేకాకుండా తన ఫాలోవర్స్ తో బాగా ముచ్చట్లు పెడుతుంది.
ఇక ఈమెకు సిరి హనుమంత్ తో మంచి బంధం ఉంది.సిరి హనుమంత్ గురించి అందరికీ తెలిసిందే.
ఈమె కూడా యాంకర్ గా కెరీర్ ని మొదలు పెట్టగా.తొలిసారిగా ఉయ్యాల జంపాల సీరియల్ తో బుల్లితెరకు పరిచయమైంది.
ఆ తర్వాత మోహిని, అగ్నిసాక్షి సీరియల్స్ లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇదంతా పక్కన పెడితే.ఈమె మరో నటుడు శ్రీ హాన్ ను ప్రేమిస్తున్న సంగతి తెలిసిందే.అంతేకాకుండా వీరిద్దరు కలిసి పలు షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించారు.సాఫ్ట్ వేర్ బిచ్చగాళ్ళు సిరీస్ లో నటించగా ఈ సిరీస్ ద్వారా మంచి గుర్తింపు అందుకున్నారు.అంతేకాకుండా రామ్ లీలా అనే వెబ్ సిరీస్ కూడా వీరికి మంచి క్రేజ్ ను అందించింది.
ఇక పలు బుల్లితెర షో లలో కూడా వీళ్లు జంటగా పాల్గొన్నారు.ఇదంతా పక్కన పెడితే.బుల్లితెరపై ప్రసారమైన బిగ్ బాస్ లో సిరి పాల్గొని ఎంత రచ్చ నడిపిందో చూసాం.ఏకంగా ప్రేమ జంట మధ్య చిచ్చుపెట్టి పక్కకు తప్పుకుంది.గతంలో సీజన్ 5 పూర్తవగ అందులో పాల్గొన్న కంటెస్టెంట్ ల గురించి సోషల్ మీడియాలో బాగా హాట్ టాపిక్ గా మారింది.ముఖ్యంగా షణ్ముఖ్, సిరి ల గురించి మాత్రం బాగా వైరల్ గా మారింది.
వీరిద్దరు బిగ్ బాస్ హౌస్ లో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.
అయితే ప్రస్తుతం శ్రీహాన్ సీజన్ సిక్స్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే.ఇక తన ప్రియుడిని గెలిపించడానికి సోషల్ మీడియాలో బాగా ప్రచారం చేస్తూ ఉంటుంది.ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా ఆరోహి తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెట్టింది.
అందులో ఓ నెటిజన్ సిరి అక్క ని కలువంటూ కామెంట్ పెట్టగా.వెంటనే ఆరోహి సిరిని ట్యాగ్ చేసి ఏమో అంటున్నారు అని అపాయింట్మెంట్ ఇవ్వండి అని అన్నది.
దాంతో సిరి వెంటనే.హలో ముందు మీరు ఫోన్ లిఫ్ట్ చేయండి అంటూ కామెంట్ పెట్టింది.ప్రస్తుతం ఆ కామెంట్ బాగా వైరల్ గా మారింది.