అమెరికాలో ఓ దోపిడి దొంగ రెచ్చిపోయాడు.భారత సంతతి వ్యక్తి నడుపుతున్న ఓ స్టోర్‌లో తుపాకులతో బెదిరించి డబ్బుతో పరారయ్యాడు.
వర్జీనియా రాష్ట్రంలో( Virginia ) ఆదివారం ఈ ఘటన జరిగింది.దుండగుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.వుడ్స్ ఎడ్జ్ రోడ్‌లోని శ్యామల్ పటేల్( Shyamal Patel ) నడుపుతున్న స్మోకీ లాంజ్ స్మోక్ షాపులో( Smokies Lounge Smoke Shop ) తెల్లవారుజామున 5 గంటలకు ప్రవేశించిన దుండగుడు గుమాస్తాను తుపాకీతో బెదిరించి నగదు ఇవ్వాల్సిందిగా హెచ్చరించాడు.5 అడుగుల 6 అంగులాల ఎత్తు .ముఖానికి ముసుగుతో గ్రే హూడీ, ముదురు రంగు ప్యాంటు, నల్లటి బూట్లు ధరించిన దుండగుడు డబ్బుతో పారిపోయినట్లు చెస్టర్‌ఫీల్డ్ కౌంటీ పోలీస్ డిపార్ట్‌మెంట్ తెలిపింది.
ఈ దోపిడి ఘటనపై దుకాణ యజమాని శ్యామల్ పటేల్ మీడియాతో మాట్లాడుతూ.
తన దుకాణాన్ని దొంగలు దోచుకోవడం ఇదే తొలిసారి కాదన్నారు.ఈ ఏడాది ఏప్రిల్‌లోనూ ఇద్దరు సాయుధులైన వ్యక్తులు డబ్బు దోచుకుని పారిపోయారని చెప్పారు.
పోలీసులు తీవ్రంగా గాలించి ఒకరిని అరెస్ట్ చేశారని శ్యామల్ పటేల్ పేర్కొన్నారు.తాజా దోపిడీకి పాల్పడిన వ్యక్తి .రెండేళ్ల క్రితం తనతో కలిసి పనిచేసిన మాజీ ఉద్యోగి అయివుండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

పటేల్ అనుమానించినప్పటికీ.పోలీసులు మాత్రం అనుమానితుడి గుర్తింపును ప్రజలకు విడుదల చేయలేదు.వరుస దొంగతనాల నేపథ్యంలో శ్యామల్ పటేల్ తన దుకాణంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
స్టోర్ మొత్తం కవర్ చేసేలా అదనంగా 12 సీసీ కెమెరాలను( CCTV Cameras ) ఏర్పాటు చేశారు.రాత్రి 8 గంటల తర్వాత ఏడీటీ సిస్టమ్‌ను యాక్టివేట్ చేస్తామని శ్యామల్ తెలిపారు.
ఎంట్రీ గేటు వద్ద ఎవరైనా డోర్ బెల్ నొక్కితే.క్లర్క్ లోపలి నుంచి తలుపు ఓపెన్ చేస్తారని ఆయన వెల్లడించారు.
అయినప్పటికీ తన దుకాణంలో దొంగతనం( Robbery ) జరగడం పోలీసులను సైతం విస్మయానికి గురిచేస్తోంది.

కాగా.యూఎస్ బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ ప్రకారం.దుకాణాలు, పెట్రోల్ బంకులు వంటి వాణిజ్య ప్రాంతాల్లో పనిచేసే వ్యక్తులే అత్యధికంగా చంపబడుతున్నారు.
అర్ధరాత్రి వేళల్లో తెరిచేవుండే పెట్రోల్ బంకుల్లో పెద్ద సంఖ్యలో పనిచేసే భారతీయులు, ఇతర దక్షిణాసియా వాసులు తరచుగా దొంగల చేతిలో బలవుతున్నారు.గతేడాది సెప్టెంబర్‌లో మిస్సిస్సిప్పిలోని టుపెలోలోని పెట్రోల్ బంకులో పరమ వీర్ సింగ్ అనే భారతీయుడు హత్యకు గురయ్యాడు.
ఆ వెంటనే నవంబర్‌లో పాకిస్తాన్ జాతీయుడైన అలీ జుల్ఫికర్ న్యూయార్క్‌లోని ఒక పెట్రోల్ స్టేషన్‌లో హత్యకు గురయ్యాడు.