రేపు తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాక

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన తరువాత మొదటిసారి కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు.ఈ మేరకు రేపు ఆదిలాబాద్ జిల్లాలో ఆయన పర్యటించనున్నారు.

 Union Home Minister Amit Shah Is Coming To Telangana Tomorrow-TeluguStop.com

ఇందులో భాగంగా ఆదిలాబాద్ లో బీజేపీ నిర్వహించే జనగర్జన సభలో అమిత్ షా పాల్గొననున్నారు.అనంతరం హైదరాబాద్ లో మేధావులతో భేటీ కానున్న అమిత్ షా బీజేపీ ముఖ్యనేతలతోనూ సమావేశం కానున్నారు.

రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది.అదేవిధంగా ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో పార్టీ నేతలు అనుసరించాల్సిన వ్యూహాలపై అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube