ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు పరశురామ్ డైరెక్షన్ లో ‘సర్కారు వారి పాట‘ సినిమా చేస్తున్నాడు.పరశురామ్ సామజిక అంశాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న అవినీతి, మోసాలు గురించి ఈ సినిమాలో చూపించబోతున్నారని తెలుస్తుంది.ఇందులో మహేష్ బాబు బ్యాంక్ మేనేజర్ కొడుకుగా నటిస్తున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్ దుబాయ్ లో పూర్తి చేసుకుంది.అక్కడ భారీ యాక్షన్ సీన్స్ తెరకెక్కించాడు డైరెక్టర్.రీసెంట్ గా రెండవ షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభం అయ్యి కరోనా కారణంగా వాయిదా పడింది.కరోనా తగ్గుముఖం పడితే కానీ మళ్ళీ షూటింగ్ మొదలు పెట్టరు.
ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తుంది.అయితే ఈ సినిమాకు సంబంధించి ఇంత వరకు ఎలాంటి అప్డేట్ రాలేదు.
మే 31న కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి టీజర్ విడుదల అవుతుందని అంత భావించారు.కానీ కరోనా కారణంగా దేశంలో నెలకొన్న పరిస్థితులు కారణంగా ఈ సినిమా నుండి ఎటువంటి అప్డేట్ ఇవ్వడం లేదని చిత్ర యూనిట్ ప్రకటించారు.

ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో నటించే విలన్ గురించి రోజుకొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.తాజాగా ఈ సినిమాలో నటించే విలన్ రోల్ కోసం చర్చ జరుగుతుంది.
ఇప్పటికే ఈ రోల్ కోసం చాలా మంది పేర్లు వినిపించాయి.కానీ ఇప్పుడు మహేష్ బాబుకు విలన్ దొరికాడని వార్తలు వస్తున్నాయి.
ఈ విలన్ రోల్ లో అర్జున్ సార్జా ఫిక్స్ అయినట్టు ఇండస్ట్రీ వర్గాల నుండి వినిపిస్తున్న టాక్.చూడాలి మరి నిజంగానే ఈయన ఈ రోల్ లో కనిపిస్తాడో లేదో.