టీజర్‌ రివ్యూ : ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ కాలర్‌ ఎగరేసేలా చేసిన త్రివిక్రమ్‌

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘అరవింద సమేత’ చిత్రం టీజర్‌ నేడు స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రంను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

 Aravindha Sametha Movie Teaser Review-TeluguStop.com

అజ్ఞాతవాసి చిత్రం ఫ్లాప్‌ అవ్వడంతో దర్శకుడు త్రివిక్రమ్‌పై ఎన్టీఆర్‌ అభిమానులు కాస్త అనుమానాలు వ్యక్తం చేశారు.కాని తాజాగా విడుదలైన టీజర్‌తో సినిమా స్థాయి అమాంతం పెరిగి పోయింది.

ఎన్టీఆర్‌ అభిమానులు ఆయన్ను ఎలా అయితే కావాలని, చూడాలని అనుకుంటున్నారో అలాగే ఈ చిత్రంలో కనిపించాడు.పక్కా మాస్‌ మసాలా కానెప్ట్‌తో తెరకెక్కిన చిత్రం అంటూ టీజర్‌ చూస్తుంటే అనిపిస్తుంది.

భారీ స్థాయిలో దసరాకు ఈ చిత్రం రచ్చ చేయడం ఖాయం అని ఈ టీజర్‌ చూస్తుంటే అనిపిస్తుంది.టీజర్‌లో ఎన్టీఆర్‌ చెప్పిన డైలాగ్స్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్నాయి.

ఎన్టీఆర్‌ సిక్స్‌ ప్యాక్‌తో పాటు, యాక్షన్‌ సీన్స్‌లో ఆయన ఎమోషన్‌ సినిమాకు హైలైట్‌ అవుతాయని ఎన్టీఆర్‌ అభిమానులు భావిస్తున్నారు.

నందమూరి అభిమానులు కాలర్‌ ఎగరేసుకునేలా ఈ టీజర్‌ ఉందని అంటున్నారు.త్రివిక్రమ్‌ మొదటి సారి ఎన్టీఆర్‌కు వంద కోట్ల మూవీని ఇవ్వబోతున్నాడు అంటూ అప్పుడే ఫ్యాన్స్‌ ఊహాగాణాలు చేసేస్తున్నారు.ఎన్టీఆర్‌ ఈ చిత్రంలో రాయలసీమ యాసలో మాట్లాడబోతున్నాడు.

అందుకోసం ప్రత్యేకంగా సిద్దం అయ్యాడు.ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటించగా కీలక పాత్రల్లో జగపతిబాబు మరియు నాగబాబులు నటించారు.

ప్రస్తుతం చివరి దశ చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని అక్టోబర్‌లో విడుదల చేయబోతున్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube