విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గగుడి ఈవోకు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.ఈ మేరకు కనకదుర్గ ఆలయ ఈవో భ్రమరాంబ ఈ నెల 8న న్యాయస్థానం ఎదుట హాజరుకావాలని ఆదేశాలు ఇచ్చింది.
కరోనా సమయంలో తొలగించిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని నోటీసుల్లో పేర్కొంది.అయితే ఉత్తర్వులు అమలు చేయనందుకు కోర్టుకు రావాలని ఆదేశించింది.
రెగ్యులరైజేషన్ లో అన్యాయం జరిగిందని ఆలయ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.ఈ మేరకు ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.