1.శబరిమల సమాచారం
నేటి నుంచి జనవరి 9 వరకు శబరిమల అయ్యప్పస్వామి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
2.ఢిల్లీ లో నేడు జీఎస్టీ మండలి సమావేశం
నేడు ఢిల్లీ లో జీఎస్టీ మండలి సమావేశం నిర్వహిస్తున్నారు.ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహిస్తున్నారు.
3.ఏపీ సినిమా టికెట్ల పై కమిటీ

నేడు ఏపీలో సినిమా టికెట్ల ధరలపై ఏర్పాటయిన కమిటీ భేటీ కానుంది.
4.గవర్నర్ ను కలవబోతున్న బండి సంజయ్
నేడు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గవర్నర్ తమిళిసై ను కలవనున్నారు.
5.ఉత్తరప్రదేశ్ లో అమిత్ షా పర్యటన

కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు ఉత్తరప్రదేశ్ లో పర్యటిస్తున్నారు.
6.రేపటి నుంచి విజయవాడలో పుస్తక మహోత్సవం
రేపటి నుంచి విజయవాడలో పుస్తక మహోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు.
7.సోము వీర్రాజు కామెంట్స్

తను సారాయి వీర్రాజు అని కామెంట్ చేయడంతో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు.తాము 40 రూపాయల కి సన్న బియ్యం ఇస్తామని కూడా ప్రకటించామని దమ్ముంటే బియ్యం వీర్రాజు అని పిలవాలని సవాల్ చేశారు.
8.సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు నడపాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.
9.వైసీపీ కోవర్ట్ లపై చర్యలు తీసుకోవాలి : రోజా

నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా శుక్రవారం చిత్తూరు జిల్లా ఎస్పి సెంథిల్ కుమార్ ను కలిశారు.వైసీపీ కోవర్ట్ లు వసూళ్లకు పాల్పడుతున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
10.ఇండియా లో తొలి ఒమి క్రాన్ మరణం
ఇండియా లో తొలి ఒమి క్రాన్ మరణం సంభవించింది.రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ కు చెందిన 73 ఏళ్ల వ్యక్తి ఒమి క్రాన్ వైరస్ ప్రభావం తో మరణించారు.
11.వస్త్రాలపై జీఎస్టీ పెంపు నిర్ణయం వాయిదా
వస్త్రాలపై జిఎస్టి పెంపు నిర్ణయాన్ని జీఎస్టీ కౌన్సిల్ సమావేశం వాయిదా వేసింది.
12.ప్రకాశం జిల్లాలో ఒమి క్రాన్ కేసు
ప్రకాశం జిల్లాలో తొలి ఒమి క్రాన్ కేసు నమోదైంది.ఇటీవల దుబాయ్ నుంచి వచ్చిన ఓ యాభై ఏళ్ల మహిళలకు ఈ వైరస్ లక్షణాలు కనిపించాయి.
13.విజయసాయి రెడ్డి కామెంట్స్
ప్రతిపక్ష పార్టీల నేతలు చౌకబారు విమర్శలు చేస్తున్నారని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శించారు.
14.ఏపీలో కరోనా
గడచిన 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా కొత్తగా 130 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
15.తెలంగాణలో కరోనా
గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 280 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
16.తెలంగాణలో ఒమి క్రాన్

తెలంగాణలో కొత్తగా 5 ఒమి క్రాన్ కేసులు నమోదు అయ్యాయి.
17.రైతు ఆత్మహత్యలపై రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
గడిచిన మూడు నాలుగు నెలలుగా తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు.నిత్యం ఐదు నుంచి పది మంది వరకు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలంగాణ ప్రభుత్వానికి రేవంత్ బహిరంగ లేఖ రాశారు.
18.భారత్ లో ఒమి క్రాన్

భారత్ లో ఒమి క్రాన్ కేసుల సంఖ్య 1270 కి చేరాయి.
19.మహారాష్ట్ర లో జనవరి 15 వరకు 144 సెక్షన్
మహారాష్ట్ర లో జనవరి ,15, వ తేదీ వరకూ 144 సెక్షన్ విధిస్తూ అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 46,750
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 48,750
.