బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతున్న సంగతి తెలిసిందే.సుశాంత్ కేసు దర్యాప్తులో డ్రగ్స్ గురించి వెలుగులోకి రావడంతో ఈ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
డ్రగ్స్ కేసులో సీబీఐ, ఎన్సీబీ అధికారులు రియా చక్రవర్తిని అరెస్ట్ చేయడంతో పలువురు హీరోయిన్లకు సమన్లు జారీ చేసి విచారించిన సంగతి తెలిసిందే.సుశాంత్ మృతి తర్వాత ఆయన అంత్యక్రియలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న వీడియోపై సుశాంత్ మాజీ ప్రియురాలు, సహనటి అంకిత లోఖండే తీవ్ర అసహనం వ్యక్తం చేయడంతో పాటు వీడియో తొలగించాలని కోరారు.సుశాంత్ కు సంబంధించిన అలాంటి వీడియోలు పోస్ట్ చేయడం తమకు ఇబ్బంది కలిగిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.
ఆ వీడియో వెంటనే తొలగించాలని సుశాంత్ అభిమానులను ఆమె వేడుకున్నారు.సుశాంత్ పై అభిమానులు ప్రేమను వ్యక్తం చేసే విధానం ఇది కాదని వెల్లడించారు.
సుశాంత్ అభిమానులు ఏం చేస్తున్నారో కనీసం వాళ్లకైనా అర్థమవుతుందా.? అని ప్రశ్నించారు.ఉన్న వీడియోలను తొలగించి కొత్త వీడియోలను పోస్ట్ చేయడం మానేయాలని పేర్కొన్నారు. సుశాంత్, అంకిత పవితా రిష్తా అనే సీరియల్ లో కలిసి నటించారు.ఆ సమయంలో వీళ్లిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు.దాదపు ఆరు సంవత్సరాల పాటు ఒకరినొకరు ప్రేమించుకుని ఆ తర్వాత విడిపోయారు.
జులై 14వ తేదీన సుశాంత్ తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.అంకిత సుశాంత్ అంత్యక్రియలకు హాజరు కాకపోయినప్పటికీ సుశాంత్ కు సంబంధించిన జ్ఞాపకాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.
సుశాంత్ మృతి విషయంలో అనేక సందేహాలు నెలకొనగా వైద్యులు ఆయన మృతిని ఆత్మహత్యగా తేల్చారు.వెలుగులోకి వచ్చిన ఈ డ్రగ్స్ కేసులో ముగ్గురు స్టార్ హీరోలకు ప్రమేయం ఉందని తెలుస్తోంది.