ప్రస్తుత ప్రపంచంలో అనేకమంది పనిలో పడి చివరికి నిద్రపోవడం కూడా మరిచిపోతున్నారు.అంతే కాదు చాలా మంది పని ఒత్తిడి కారణంగా, లేకపోతే మరేదో సమస్య వలన నిద్ర పోవడం అనేది చాలా తగ్గించేశారు.
ఇలా నిద్రలేమితో బాధపడుతున్న వారికి మంచి పరిష్కారం కివి పండ్లు. ప్రస్తుతం చాలా ఊర్లల్లో బాగా అందుబాటులోకి వచ్చిన పండ్లు ఇవి.ఈ పండ్లలో చాలా పండ్లలలో లేనటువంటి పోషకాలు కూడా మనకు పుష్కలంగా ఈ కీవి పండులో లభిస్తాయి.ఇక ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే…
కివి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం ద్వారా వాటిని తీసుకుంటే మన శరీరంలోకి రోగనిరోధకశక్తిని పెంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
అంతేకాదు ఈ పండ్లు తీసుకోవడం ద్వారా అనేక రకాల అనారోగ్యాలకు మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది.అలాగే ఎవరికైనా మధుమేహం ఉన్నవారు ఈ పండ్లను తీసుకుంటే వారి బాడీ లోకి యాంటీ ఆక్సిడెంట్స్ చేరడంతో మధుమేహాం పై పోరాటంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది కూడా.
అంతేకాదు రక్తపోటు సమస్య ఉన్న వారికి కూడా ఈ కివి పండ్లు ఎంతగానో పనిచేస్తాయి.
ముఖ్యంగా ఈ కివి పండులో ఉండే సెరొటోనిన్ అనే పదార్థం వల్ల నిద్రలేమిని పోగొట్టడానికి ఈ పండు ఎంతగానో ఉపయోగపడుతుంది.ముఖ్యంగా నిద్రపోవడానికి వెళ్లే సమయంలో ఒక గంట లేదా రెండు గంటల ముందు ఒకటి లేదా రెండు పండ్లను తినడం ద్వారా రాత్రి పడుకున్న సమయంలో హాయిగా నిద్రపోవచ్చు.ఈ పండు ను రాత్రి సమయంలో తీసుకుంటే శరీర ఉష్ణోగ్రతను కూడా బాగా తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
వీటిని గర్భిణీలు తీసుకోవడం ద్వారా కడుపులో ఉండే బిడ్డ పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది.కాబట్టి ఇన్ని పోషక విలువలు ఉన్న కివి పండు తింటూ అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందండి.