రోజుకు 14 గంటలు చదివి 23 ఏళ్లకే సివిల్ జడ్జిగా జాబ్ సాధించిన వంశీకృష్ణ.. ఇతని కష్టానికి హ్యాట్సాఫ్ అనాల్సిందే!

చిన్న వయస్సులోనే మంచి ఉద్యోగం సాధించాలంటే ఆ ఉద్యోగం సాధించడం వెనుక ఎన్నో కష్టనష్టాలు ఉన్నాయి.రోజుకు 14 గంటలు కష్టపడి చదివి 23 సంవత్సరాల వయస్సులోనే సివిల్ జడ్జిగా జాబ్ సాధించడం అంటే సులువైన విషయం కాదు.

 Andhra Univesity Majji Vamsikrishna Success Story Details Here Goes Viral In So-TeluguStop.com

ఇష్టంగా చదువుకుంటే లక్ష్యాలను సులువుగా సాధించవచ్చు.ఏయూ న్యాయ కళాశాల విద్యార్థి మజ్జి వంశీకృష్ణ ( Majji vamsikrishna )సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తోంది.

శ్రీకాకుళం జిల్లా( Srikakulam )లోని కళింగపట్నంకు చెందిన వంశీకృష్ణ ఇంటర్ లో 983 మార్కులు సాధించి ఆ తర్వాత న్యాయవిద్యను ఎంపిక చేసుకున్నాడు.తల్లీదండ్రులు టైలర్లుగా పని చేస్తుండగా చిన్నప్పటి నుంచి వంశీకృష్ణ ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు.

ఏపీ లాసెట్ లో రాష్ట్ర స్థాయిలో నాలుగో ర్యాంక్ సాధించిన వంశీకృష్ణ ఐదేళ్ల న్యాయ విద్యను విజయవంతంగా పూర్తి చేశారు.

ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా జూనియర్ సివిల్ జడ్జి పరీక్ష కోసం ప్రిపేర్ అయిన వంశీకృష్ణ తన టాలెంట్ తో ఆ ఉద్యోగానికి ఎంపికయ్యారు.తొలి ప్రయత్నంలోనే లక్ష్యాన్ని సాధించి వంశీకృష్ణ తన కలను నెరవేర్చుకున్నారు.ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ విజయవంతంగా పూర్తి చేసిన వంశీకృష్ణ తను కన్న కల నెరవేరడంతో ప్రస్తుతం ఎంతగానో సంతోషిస్తుండటం గమనార్హం.

రోజుకు 14 గంటల పాటు కష్టపడటం వల్లే నా కల నెరవేరడం సాధ్యమైందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.ఉదయం 4 గంటలకు ప్రిపరేషన్ మొదలుపెట్టి రాత్రి 10.30 గంటలకు ముగించేవాడినని ఆయన పేర్కొన్నారు.కఠోర శ్రమ వల్లే నా లక్ష్య సాధన జరిగిందని వంశీకృష్ణ అన్నారు.

వంశీకృష్ణ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.వంశీకృష్ణ కెరీర్ పరంగా మరింత సక్సెస్ కావాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.

వంశీకృష్ణ సక్సెస్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందేనని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సక్సెస్ కు షార్ట్ కట్స్ ఉండవని వంశీకృష్ణ తన ప్రతిభతో ప్రూవ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube