యాంకర్ సుమ కొడుకును చూశారా.. ఎలా ఉన్నాడంటే?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగు బుల్లితెరపై మకుటంలేని మహారాణిగా దూసుకుపోతోంది.

 Anchor Suma Son Roshan Photos Viral On Social Media Details, Anchor Suma, Son R-TeluguStop.com

బుల్లితెరపై ఏ ఈవెంట్ లో చూసినా సుమ కనకాల పేరే వినిపిస్తూ ఉంటుంది.ఈవెంట్లలో, షో లలో, ప్రీ రిలీజ్ వేడుకలో ఎక్కడ చూసినా కూడా యాంకర్ సుమ పేరే వినిపిస్తూ ఉంటుంది.

యాంకర్ సుమ తెలుగు నటుడు రాజీవ్ కనకాల ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.ఈ దంపతుల కుమారుడు రోషన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇప్పటికే హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ తో కలసి నిర్మలా కాన్వెంట్ చిత్రం లో నటించాడు ఆ తర్వాత పై చదువుల కోసం యూఎస్ వెళ్లాడు.

ఇక ప్రస్తుతం రోషన్ ఇండియాకు తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.ఇక కొడుకుని హీరోగా పరిచయం చేయడానికి సుమ, రాజీవ్ కనకాల తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

ఈ క్రమంలోనే సొంతంగా ఒక సినిమాను కూడా నిర్మించగా ఆ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి.అయితే ఇంతవరకు ఆ సినిమా నుంచి ఎటువంటి అప్డేట్ రాలేదు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం సుమ కొడుకు రోషన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సుమ తన కొడుకు పుట్టినరోజు సందర్భంగా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొడుకు రోషన్ ఫోటోలను షేర్ చేసింది సుమ.రోషన్ కి బర్త్ డే విషెస్ చెబుతూ ఫోటోలను షేర్ చేసింది.ఈ ఫొటోలను చూసిన నెటిజన్స్ షాక్ అవుతున్నారు.

అతను రోషనేనా? ఏంటి ఇలా మారిపోయాడు? సుమ కు ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా? ఇప్పుడు ఇంత పెద్ద వాడు అయ్యాడా అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నాడు.

సుమ కొడుకు పక్కపక్కనే నిలుచుంటే అక్క తమ్ముడు గా కనిపిస్తున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్.రోషన్ పుట్టినరోజు సందర్భంగా సుమ అభిమానులు రోషన్ కి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.సుమ కొడుకు కూడా చూడటానికి చాలా పొడవుగా, సూపర్ లుక్ తో అందరినీ ఆకట్టుకున్నాడు.

అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube