అవన్నీ నిజాలు కాదు రూమర్లే.. సుమ ఏం చెప్పిందంటే..?

బుల్లితెర యాంకర్లలో ఎంతోమంది యాంకర్లు ఉన్నా సుమకు ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు.సాధారణంగా పెళ్లి తర్వాత యాంకర్లకు, హీరోయిన్లకు అవకాశాలు తగ్గుతాయని ఇండస్ట్రీలో చాలామంది భావిస్తారు.

 Anchor Suma Interesting Comments About Dress And Birthday Gifts, Anchor Suma , D-TeluguStop.com

అయితే సుమ విషయంలో మాత్రం అందుకు భిన్నంగా పెళ్లి తర్వాతే ఆమె వరుస అవకాశాలతో బిజీ అయ్యారు.ఎప్పుడూ వరుస షోలతో, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఆడియో ఫంక్షన్లతో బిజీగా ఉండే సుమ గతేడాది లాక్ డౌన్ సమయంలో అవకాశాలు తగ్గినా మళ్లీ ఆమె వరుస అవకాశాలతో బిజీ అవుతున్నారు.
సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడూ ఫోటోలను షేర్ చేయడంతో పాటు అనేక విశేషాలను వెల్లడిస్తూ ఉంటారు.ప్రతిరోజూ వేర్వేరు ఛానల్స్ లో వేర్వేరు షోలలో పాల్గొనే సుమ కొత్త కొత్త క్యాస్టూమ్స్ లో అభిమానులకు కనిపిస్తూ ఉంటారు.

మేకప్ కోసం, క్యాస్టూమ్స్ కోసం సుమ రోజులో ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది.అయితే సుమ ఒక సందర్భంగా తన మేకప్, స్టైలిష్ట్ సిబ్బంది సరిగ్గా ఉంటారు కాబట్టే పనులు వేగవంతంగా చేయగలుగుతున్నానని తెలిపారు.
చాలామంది తన కాస్ట్యూమ్స్ కట్టుకునే చీరలను చూసి తన దగ్గర చాలా చీరలు ఉన్నాయని భావిస్తారని కానీ అందులో నిజం లేదని ఆమె అన్నారు.తను షాపింగ్ కు అధికంగా సమయం కేటాయిస్తానని అనుకుంటారని అందులో కూడా నిజం లేదని ఆమె వెల్లడించారు.

పుట్టినరోజు సమయంలో తండ్రి ఒక చీరను ఇస్తాడని ఒకటో రెండో చీరలు మిగతా వారు ఇస్తారని ఎక్కువ చీరలు ఉన్నాయని భావించడంలో నిజం లేదని అన్నారు.

తనకు షాపింగ్ పై కూడా పెద్దగా ఆసక్తి ఉండదని సుమ తన రహస్యాలను వెల్లడించారు.

మరోవైపు సుమ ఈటీవీ, జీటీవీ, మాటీవీ ఛానెళ్లలో వేర్వేరు ప్రోగ్రామ్ లు చేస్తున్నారు.థియేటర్లకు 100 శాతం ఆక్యుపెన్సీతో అనుమతులు ఇవ్వడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్లతో సుమ బిజీ అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube