బుల్లితెర యాంకర్ గా, వెండితెర నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న జబర్దస్త్ జడ్జ్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఒకవైపు బుల్లితెరపై యాంకర్ గాకొనసాగుతూనే వెండితెరపై ఎన్నో సినిమాలలో నటించే అవకాశాలను దక్కించుకుని దూసుకుపోతున్న అనసూయ కెరీర్ పరంగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.
ఈ క్రమంలోనే ఈమె సోషల్ మీడియా వేదికగా చేసే పోస్టులు క్షణాలలో వైరల్ గా మారుతుంటాయి.
ఈ క్రమంలోనే కొన్నిసార్లు అనసూయ చేసే ఫోటోలు లేదా పోస్టులకు నెటిజన్ల నుంచి దారుణమైన ట్రోల్స్ ను ఎదుర్కొంటూ ఉంటారు.
ఇకపోతే అనసూయ తాజాగా మరొక వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ఈ వీడియోలో అనసూయ భర్త ఉండగా అనసూయ అసలు మగాళ్ళతో అవసరం ఏంటి? అంటూ ప్రశ్నించారు.ఈ విధంగా సోషల్ మీడియా వేదికగా మగవారి గురించి ఈ విధమైనటువంటి బోల్డ్ కామెంట్స్ చేస్తూ… తన భర్త పరువు తీయడమే కాకుండా జస్ట్ జోక్ అంటూ సమర్థించుకుంది.
ప్రస్తుతం అనసూయ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఎవరికైనా మహిళలకు అన్యాయం జరిగింది అంటే తన గొంతు వినిపించడమే కాకుండా తన గురించి ఎవరైనా నెగిటివ్ కామెంట్లు చేస్తే తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసే అనసూయ ఈ విధమైనటువంటి కామెంట్ చేయడంతో అందరూ ఎంతో ఆశ్చర్యపోతున్నారు.ఇక ప్రస్తుతం ఈమె పలు చిత్రాలతో ఎంతో బిజీగా ఉన్నారు.