టాలీవుడ్ యాంకర్, నటి అనసూయ( Anasuya )ను తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా వయసుతోపాటు అందం పెంచుకుంటూ పోతుంది.
సినీ ఇండస్ట్రీకి కాస్త ముందు అడుగుపెడితే ఈమె ఇప్పుడు ఒక స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఉండేది.అయినప్పటికీ కూడా అదే రేంజ్ లో ఇప్పుడు దూసుకుపోతుంది.
మొదట్లో న్యూస్ రీడర్ గా పనిచేసిన అనసూయ ఆ తర్వాత వెండితెరపై సైడ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టింది.ఇక బుల్లితెరపై జబర్దస్త్( Jabardasth ) లో యాంకర్ గా అడుగుపెట్టగా ఇక అప్పటి నుంచి అనసూయకు తిరుగులేదు అని చెప్పవచ్చు.ఎప్పుడైతే జబర్దస్త్ లో యాంకర్ గా అడుగుపెట్టిందో అప్పటినుంచి ఇప్పటివరకు ఎంతో పేరు సంపాదించుకుంది అనసూయ.అసలు వెనుతిరిగి చూడకుండా ముందుకు దూసుకుపోతుంది.
జబర్దస్త్ లో తన ఎంట్రీ డాన్స్ తో, తన డ్రెస్సింగ్ స్టైల్స్ తో అందర్నీ ఫిదా చేసింది.దీంతో ఆమెకు వెండితెరపై అవకాశం రాగా నటిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఒక వైపు యాంకర్ గా బాధ్యతలు చేపడుతూనే మరో పక్క నటిగా అవకాశాలు అందుకుంటూ చాలా బిజీ బిజీగా గడిపింది.ఇప్పుడు బుల్లితెరకు పూర్తిగా గుడ్ బై చెప్పేసి వెండితెరపై సెటిల్ అయింది.
ఇక కొన్ని సినిమాలలో స్పెషల్ సాంగ్ లో కూడా చేసింది అనసూయ.
సోషల్ మీడియాలో మాత్రం అనసూయ యాక్టివ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.
గ్లామర్ షో చేయడానికి ఏమాత్రం వెనుకాడదు అనసూయ.పైగా తన భర్త నుండి తనకు పూర్తి ఫ్రీడం దొరకడంతో తన అందాలతో బాగా రెచ్చిపోతూ ఉంటుంది.
ఇక అప్పుడప్పుడు అనసూయ బాగా ట్రోలింగ్స్ కూడా ఎదుర్కొంటూ ఉంటుంది.
కొన్ని కొన్ని సార్లు వాటిని అస్సలు పట్టించుకోదు.ఒకవేళ పట్టించుకుంటే మాత్రం అవి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాల్సినవే.ఇక కొన్ని రోజుల నుండి ఈమె మంచి ఫిట్నెస్ కోసం ప్రయత్నిస్తుంది.
జిమ్ములో గంటలు తరబడి బాగా వర్కౌట్లు చేస్తుంది.వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా బాగా షేర్ చేస్తుంది.
అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా ఫ్రీడమ్ ఫైటర్, క్వీన్ బేగం హజరత్ మహల్ ఫోటో( Queen Begum Hazrat Mahal ) పంచుకోగా.అచ్చం ఆవిడ లాగే ఉన్న తన ఫోటోను షేర్ చేసుకుంది.
ఇక తమ ఇద్దరి ఫోటోలు మ్యాచ్ అయినట్లుగా చూపించడమే కాకుండా ఆమె గురించి కొన్ని విషయాలు చెప్పుకొచ్చింది.
ఇక ఆ పోస్ట్ చూసి అనసూయ ను ఓ రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు.కొందరు నెగిటివ్గా కామెంట్లు పెడుతున్నారు.అయితే ఒక నెటిజన్.
ఇంకెన్ని దరిద్రాలు చూడాలో.చివరికి ఇన్స్టాగ్రామ్ ఇలా అయిపోయింది ఏంటి అంటూ కామెంట్ చేశారు.
ప్రస్తుతం ఆ కామెంట్ బాగా వైరల్ అవుతుంది.మరి తనకు వచ్చిన కామెంట్ గురించి అనసూయ స్పందిస్తుందో లేకుంటే లైట్ తీసుకుంటుందో చూడాలి.