మరోసారి అనసూయను గెలికిన విజయ్ ఫ్యాన్స్... యానిమల్ సినిమా చూడలేదా అంటూ?

బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం వెండితెర సినిమాలలో నటిస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నటువంటి నటి అనసూయ ( Anasuya ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఒకప్పుడు బుల్లితెర యాంకర్ గా ఓ వెలుగు వెలిగినటువంటి ఈమె ప్రస్తుతం వెండితెరకు పరిమితమయ్యారు.

 Anasuya Get Trolled For Animal Cinima Bold Scenes Details,anasuya,,vijay Fans,an-TeluguStop.com

ఇలా వెండితెరపై వరుస అవకాశాలు రావడంతో పూర్తిగా బుల్లితెర కార్యక్రమాలకు దూరమయ్యారు.ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే అనసూయ తరచు ఏదో ఒక పోస్ట్ చేయడం ద్వారా కొన్నిసార్లు వివాదంగానే మారుతుందనే సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈమెకు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) తో భారీ స్థాయిలో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే.

Telugu Anasuya, Anchor Anasuya, Animal, Arjun Reddy, Liger, Sandeepreddy, Vijay

సందీప్ రెడ్డి వంగ(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి(Arjun Reddy) సినిమా సమయంలో అనసూయ విజయ్ దేవరకొండ ఉద్దేశించి చేసినటువంటి పోస్ట్ పెద్ద ఎత్తున వివాదంగా మారింది.ఇక అప్పటినుంచి విజయ్ దేవరకొండ వర్సెస్ అనసూయ అనేలా మారిపోయింది.అలాగే లైగర్ సినిమా విషయంలో కూడా అనసూయ అలాంటి కామెంట్ చేయడంతో విజయ్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో అనసూయ పై ఫైర్ అవుతూ ఆమెను భారీగా ట్రోల్ చేశారు.

ఈ వివాదం ఏకంగా సైబర్ క్రైమ్ పోలీసుల వరకు వెళ్ళింది.

Telugu Anasuya, Anchor Anasuya, Animal, Arjun Reddy, Liger, Sandeepreddy, Vijay

తాజాగా మరోసారి విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అనసూయను గెలికారని తెలుస్తుంది.సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన యానిమల్ సినిమా( Animal Movie ) ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే ఈ సినిమాలో కాస్త బోల్డ్ సన్నివేశాలు కూడా ఉన్నాయి.ఈ సన్నివేశాలను ఉద్దేశించి విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా అనసూయను ఉద్దేశిస్తూ యానిమల్( Animal ) సినిమా చూడలేదా ఆంటీ అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఇందులో బోల్ట్ సన్నివేశాల గురించి ఎందుకు మౌనంగా ఉన్నారు అంటూ కామెంట్ చేయగా మరికొందరు ఈమె కేవలం విజయ్ దేవరకొండ సినిమాలను మాత్రమే తప్పు పడతారు అంటూ మరికొందరు అనసూయ పై కామెంట్ చేస్తున్నారు.మరి ఈ వ్యాఖ్యలపై అనసూయ స్పందన ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube