జబర్దస్త్ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ సోషల్ మీడియాలో ఏదో ఒక వివాదం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.ఈ క్రమంలోనే నిన్న గణతంత్ర దినోత్సవం కావడంతో ఈ యాంకరమ్మ ఎంతో చక్కగా వందేమాతరం అంటూ ఇంస్టాగ్రామ్ ద్వారా ఒక వీడియోని షేర్ చేశారు.
ఇక ఎప్పటిలాగే ఈ వీడియో పైన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తన గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వందేమాతరం పాట పాడిన తాను చేసినది తప్పు అంటూ పెద్ద ఎత్తున ఆమెపై విరుచుకుపడుతున్నారు.
వందేమాతరం పాట పాడుతూ ఆ వీడియోని షేర్ చేసిన అనసూయకు ఒక నెటిజెన్ సలహా ఇచ్చారు .మీరు చాలా అద్భుతంగా పాడారు అయితే వందేమాతరం పాడుతున్న సమయంలో లేచి నిలబడి ఉంటే ఇంకా చాలా బాగుండేది.నేను మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే క్షమించండి అంటూ కామెంట్ చేశారు.ఇక ఈ కామెంట్ పై అనసూయ స్పందిస్తూ నేను పాడినది జాతీయ గేయం వందేమాతరం.
జాతీయ గీతం జనగణమన పాడితే లేచి నిలబడాలి.జాతీయ గేయం వందేమాతరాన్ని బంకించంద్ర చటర్జీ రాస్తే.
రవీంద్రనాథ్ ఠాగూర్ మొదటిసారిగా పాడారు నాకు కూడా దేశం అంటే గౌరవం ఉంది.నేను కూడా దేశాన్ని ప్రేమిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు.
ఇక ఈ వీడియోలో అనసూయ ధరించిన టీషర్ట్ పై గాంధీజీ బొమ్మ ఉండడం కూడా మరింత వివాదానికి తెరలేపింది.ఈరోజు రాజ్యాంగం అమలులోకి వచ్చింది కనుక టీ షర్ట్ పై ఉండాల్సింది గాంధీ బొమ్మ కాదు అంబేద్కర్ బొమ్మ అని మరి కొందరు ఆమెకు సలహా ఇచ్చారు.ఇక ఈ విషయంపై అనసూయ స్పందిస్తూ ఏందిరా బై మీ లొల్లి.నేషనల్ యాంతం అంటారు గాంధీజీకి రాజ్యాంగానికి సంబంధం ఏమిటి అంటారు.మరి జనగణమన ఏది ఆగస్టు 15 1947 తరువాతే 26 జనవరి 1950 అయ్యింది.కొంచెం బుర్ర అద్దెకు తెచ్చుకుని మాట్లాడండి అంటూ అనసూయ మరోసారి రెచ్చిపోయారు.