ఎన్ని హోటల్లో తిన్న, ఎన్ని రెస్టారెంట్లు అందుబాటులో ఉన్న, ఇంటి భోజనం.ఇంటి భోజనమే.
ఇంట్లో చేసుకొని తిన్న పచ్చడి వంటకం అయిన సరే కమ్మగా ఉంటుంది.అయితే సాధారణంగా బయటకి వెళ్ళేవారు, ఉద్యోగాలు చేసేవారు లంచ్ బాక్స్ మరిచిపోతే వాళ్ళు బయట ఆర్డర్ చేసుకొని తింటారు.
కానీ వారికి ఇంటి భోజనం తినాలని ఉంటుంది.ఇలాంటి ఐడియా తో ఇంటి భోజనాన్ని బయట దొరికేల ప్లాన్ చేసి ఫుడ్ బాక్స్ అనే బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్ బాట పట్టారు.
మైసూర్ లో 2015 లోనే ఫుడ్ బాక్స్ అనే సంస్థ ఏర్పడింది.కానీ వారికి స్టోర్ లేదు.ఇంట్లోనే భోజనాన్ని తయారు చేసి కస్టమర్లకు డెలివరీ చేసేవారు.తరువాత 2019 లో ఔట్లెట్ ను ప్రారంభించారు.
లక్ష రూపాయల జాబ్ వదిలేసి దీన్ని సక్సెస్ బాట పట్టించాడు ఒక యువకుడు.అందుకే దీనికి విపరీతమైన ఆదరణ ఏర్పడింది.
ఫుడ్ బాక్స్ కంపెనీ మైసూర్ కు చెందిన మురళి గుండన్న అనే యువకుడు ప్రారంభించాడు.
బైక్ ద్వారా మైసూర్ వాసులకు కేసరి బాత్, పులిహోర, ఇడ్లి, ఖీర్ వంటి కమ్మని వంటలను కస్టమర్లకు అందిస్తున్నారు.
మొదట రోజుకి 15 -20 ఫుడ్ బాక్స్ లను విక్రయించేవారు, తరువాత వారానికి 2వేల వరకు విక్రయిస్తూ లాభాల బాట పట్టారు.ఇక ఈ ఫుడ్ బాక్స్ ద్వారా ఏడాదికి 1.5 కోట్ల వరకు ఆదాయం వస్తుందని ఆయన తెలిపారు.అవును మరి కస్టమర్లకు నాణ్యమైన సేవలను అందిస్తూ వారికి నచ్చే విధంగా మన ప్రత్యేకతతో ప్రారంభించే ఏ బిజినెస్ అయిన ఖచ్చితంగా వృద్ధిలోకి వస్తుంది.