కరోనా రోగులపై అమెరికా తాజా అధ్యయనం...షాకింగ్ న్యూస్ ఏంటంటే..!!

కరోన మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి అలజడి సృష్టించిందో అందరికి తెలిసిందే.ఎంతో మంది మహమ్మారి బారిన పడి ప్రాణాలు పోగొట్టుకున్నారు.

 America's Latest Study On Corona Patients Shocking News Is , Corona, American R-TeluguStop.com

మరెంతో మంది సకాలంలో సరైన వైద్యం అందడంతో ప్రాణాపాయ స్థితి నుంచీ తప్పించుకున్నారు.మరి కొంత మంది నెలల తరబడి మంచానికే పరిమితమై పోయారు.

ఇలా ఎంతో మంది జీవితాలలో చేదు విషాన్ని నింపింది కరోనా మహమ్మారి.అయితే కరోనా తీవ్రంగా వచ్చి పూర్తిగా కోలుకున్న రోగులపై మహమ్మారి మరో దిశగా దాడి చేస్తోందట.

అమెరికా పరిశోధకులు అధ్యయనం చేసిన తరువాత ఈ విషయాన్ని తాజాగా వెల్లడించారు.

అదేంటంటే కరోనా వ్యాధి తీవ్రంగా సోకినా వారిపై మానసిక ఒత్తిడి అత్యంత తీవ్రంగా ఉంటోందట.

ఎంతో మంది కరోనా రోగులు మానసిక రుగ్మతతో ఇబ్బందులు పడుతున్నారని అమెరికాలో జరిగిన ఓ అధ్యయనం పేర్కొంది.ఈ అధ్యయనంలో భాగంగా కరోనా సోకినా దాదాపు 150 మందిని కొన్ని రోజుల పాటు స్టేడి చేశారు ఈ క్రమంలో దాదాపు సగానికి పైగా రోగులు మానసిక రుగ్మతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తేల్చి చెప్పారు.

వారి మెదడు, శరీరంలో మానసిక రుగ్మత ప్రభావం తీవ్ర చలనాన్ని కలిగిస్తోందని కనుగొన్నారు.

అంతేకాదు కరోనా సోకిన వారు తీవ్ర ఒత్తిడికి లోనవడంతో పాటు, మతిమరుపు ఉంటోందని, స్పష్టంగా మాట్లాడలేక పోతున్నారని, తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారని తేల్చి చెప్పారు.

ఈ అధ్యయనం మొత్తాన్ని బీఏంజీ ఓపెన్ స్టడీలో ప్రచురించారు.డేలిరియం లాంటి మానసిక వ్యాధి రావడం వలన వారిలో డయాబెటిస్, హైబీపీ వంటి రోగాలు కూడా నమోదు అవుతున్నాయని, మెదడుకు ఆక్సిజన్ అందక పోవడం, రక్తం గడ్డ కట్టడం డేలిరియం లక్షణాలని మిచిగాన్ వర్సిటీ కి చెందిన రచయిత ఒకరు ఈ విషయాలని వెల్లడించారు.

కరోనా వచ్చిన సమయంలో ఆందోళనకు లోనవ్వకుండా వైద్యుల సలహాలు పాటించడం ఎంతో మంచిదని, అలా చేసిన సమయంలో మానసిక రుగ్మతలు మనపై దాడి చేసే అవకాశం ఉండదని సూచనలు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube