అమెరికాలో కొన్ని రోజుల క్రితం జరిగిన నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్యోదంతం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం విధితమే.అమెరికాలోని పలు ప్రాంతాలన్నీ ఆందోళన కారులతో నిండిపోయాయి.
తమపై వివక్ష చూపుతున్నారు, హత్యలు చేస్తున్నారు జార్జ్ కి న్యాయం చేయాలి పోలీసు అధికారిని కటినంగా శిక్షించాలని వారు నినదించిన నినాదాలకి, తెలిపిన నిరసనలకి ప్రపంచ వ్యాప్తంగా మద్దతు లభించింది.అమెరికా ప్రజలు సైతం మద్దతు తెలిపగా ట్రంప్ చిన్న కూతురు సైతం వారికే మద్దతు తెలిపింది.
ఇదిలాఉంటే నిరసన కారులని నిలువరించడానికి ట్రంప్ చేయని ప్రయత్నం అంటూ లేదు.మొదట్లో ట్రంప్ వారిపై ఉక్కు పాదం మోపుతానని మిలటరీ బలగాలు దింపుతామని హెచ్చరికలు జారీ చేసి తరువాత నాలిక కరుచుకున్న విషయం విధితమే.
న్యూయార్క్, ఫిలడెల్ఫియా , షికాగో , వాషింగ్టన్ వంటి కీలక ప్రాంతాలలో కర్ఫ్యూ విధించినా ఆందోళన కారులు ఆగలేదు.దాంతో వారిని అదుపు చేయడానికి నేషనల్ గార్డ్స్ కూడా రంగంలోకి దిగారు.

ఈ నేపధ్యంలోనే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఓ కీలక ప్రకటన చేశారు.ఆందోళన కారు చేస్తున్న ఆందోళనలు అదుపులోనే ఉన్నాయి.వారితో ఎటువంటి ఇబ్బందులు లేవు, నేషనల్ గార్డ్స్ ఉండాల్సిన అవసరం ఇప్పుడు లేదని అన్నారు.అంతేకాదు వాషింగ్టన్ డిసీ ని విడిచిపెట్టి వెళ్ళాల్సిందిగా ట్రంప్ వారికి కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఇదిలాఉంటే ఒక వేళ వారి అవసరం మళ్ళీ వచ్చే పరిస్థితులు వస్తే తప్పకుండా వారిని రంగంలోకి దించుతానని ట్రంప్ ప్రకటించారు.పలు చోట్ల కర్ఫ్యూని కూడా ఎత్తేస్తున్నామని తెలిపారు నగర మేయర్స్
.