మంచి వాళ్లకి మంచే జరుగుతుంది.వాళ్ళు చేసే మంచి పనులే వారిని వెన్నంటి కాపాడుతాయి అంటూ ఇంట్లో ఉండే పెద్ద వాళ్ళు అంటుంటారు.
ఈ విషయం ఎన్నో సందర్భాలలో ఋజువు అయ్యింది.తాజాగా అమెరికాలో ఓ యువకుడి విషయంలో కూడా రుజువయ్యింది.
అమెరికాలోని న్యూయార్క్ నగరానికి చెందిన ఓ నల్లజాతి యువకుడు చేసిన ఓ మంచి పనికి సర్వాత్రా మద్దతు తెలుపుతున్నారు.జార్జ్ ఫ్లాయిడ్ మృతి తరువాత అమెరికాలో రోడ్లపైకి నల్లజాతీయులు వచ్చి చేస్తున్న నిరసనలు చూస్తూనే ఉన్నాము.
ఈ క్రమంలో నిరసన కారులు చేస్తున్న ఆందోళనలతో రోడ్లన్నీ చెత్తతో నిండిపోసాగాయి.ఈ నేపధ్యంలో స్పందించిన ఆంటోనియో గ్వీన్ అనే 18 ఏళ్ళ యువకుడు రోడ్లపై ఉన్న చెత్త చెదారాలు మొత్తం శుభ్రం చేస్తూ ఆ చెత్తని ఎత్తి రహదారులపై ఎలాంటి చెత్త లేకుండా చేస్తున్నాడు.
రోజు చీపురు పట్టుకుని సుమారు 10 గంటల పాటు శ్రమించి రోడ్లు మొత్తం శుభ్రం చేసేశాడు.ఈ విషయం ఆనోటా ఈ నోటా మీడియా ద్వారా అమెరికా వ్యాప్తంగా ప్రచురితం అయ్యింది.

కొందరు అతడు చేస్తున్న పనిని ప్రసంసిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తున్నారు.ఈ కారణంగా ఆంటోనియో గురించి తెలుసుకున్న పలువురు అతడు చేసిన మంచి పనికి సత్కరించాలని అనుకున్నారు.ఓ వ్యక్తి అతడు చేసిన మంచి పనికి మెచ్చుకుంటూ ఓ కారుని గిఫ్ట్ గా ఇచ్చాడు.ఓ వ్యాపారవేత్త ఉచితంగా ఆంటోనియా కి ఇన్సూరెన్స్ చేయించాడు.అంతేకాదు ఓ కాలేజీ సైతం అతడి చదువుకోసం స్కాలర్ షిప్ ఇవ్వడానికి సిద్దంగా ఉందని తెలిపింది.
.